స్టార్ హీరో కూతురి పేరుతో వైరల్ అవుతున్న వీడియో.. ఘాటుగా లిప్‌లాక్!
దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి హాట్ హీరోయిన్లు ఇప్పటి వరకు బాలీవుడ్ ని ఏలారు. వీరి హవా ముగింపు దశకు చేరుకుంది. బాలీవుడ్ లోకి యువ హీరోయిన్లు వస్తున్నారు. వీరిలో చాలా మంది ఫ్యూచర్ స్టార్స్ గా చెప్పబడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ హాట్ టాపిక్ గా మారిపోయింది. సారా అలీఖాన్ నటించిన కేదార్ నాథ్, సింబా చిత్రాలు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో సింబా చిత్రం ఘనవిజయం సాధించింది. సారా అలీ ఖాన్ గ్లామర్ కు యువత ఫిదా అవుతున్నారు. సారా గురించి ఏ వార్త వచ్చినా హాట్ టాపిక్ గా మారుతోంది.

లవ్ ఆజ్ కల్ 2
2009లో వచ్చిన సైఫ్ అలీ ఖాన్ లవ్ ఆజ్ కల్ చిత్రం మంచి విజయం సాధించింది. ఇంతియాజ్ అలీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. లవ్ ఆజ్ కల్ 2లో యువ హీరో కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వీడియో అంటూ ఓ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఉన్నది కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ అనే నెటిజన్లు అంటున్నారు.
ఘాటుగా లిప్‌లాక్
ఈ వీడియోలో సరైన క్లారిటీ లేకపోవడంతో ముఖాలు కనిపించడం లేదు. కానీ లిప్ లాక్ తో ఘాటుగా రొమాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఉన్నది సారా అలీఖాన్,, కార్తిక్ ఆర్యన్ అనే అంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఇది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇంటర్ నెట్ లో దుమారం రేపుతోంది.

కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్
కేదార్ నాథ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సారా అలీ ఖాన్ కార్తీక్ ఆర్యన్ గురించి హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తనకు కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేయాలని ఉన్నట్లు సారా అలీఖాన్ తెలిపింది. కానీ పెళ్లి మాత్రం కార్తీక్ ఆర్యన్ ని చేసుకోనని, రణబీర్ కపూర్ ని చేసుకుంటానకి సరదాగా వ్యాఖ్యానించింది. చలాకీగా ఉండడం, ఇలాంటి సరదాగా వ్యాఖ్యలతో సారా అలీఖాన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

షూటింగ్ వీడియో కాదు
తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి సారా అలీఖాన్ కానీ, కార్తీక్ ఆర్యన్ కానీ ఇంకా స్పందించలేదు. ఇది లవ్ ఆజ్ కల్ షూటింగ్ వీడియో కాదని కొందరు కొట్టి పారేస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో మాత్రం యాక్షన్, కట్ అంటూ దర్శకుడి వాయిస్ వినిపిస్తోంది. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో యువ హీరోగాఎదుగుతున్నాడు. సోనుకే టిటు కి స్వీటీ, లూకి చుప్పి లాంటి చిత్రాలతో కార్తీక్ ఆర్యన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


Click it and Unblock the Notifications











