Shehzada Twitter Review: అల.. వైకుంఠపురములో హిందీ రీమేక్.. మొత్తంగా ఎలా ఉందంటే?

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల..వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదే కథను హిందీలో కార్తిక్ ఆర్యన్ హీరోగా ఇప్పుడు రీమేక్ చేశారు. ఇక మొత్తానికి ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. షెహజాదా సినిమా మాత్రం ఊహించని విధంగా కొంత నెగిటివ్ టాప్ కూడా అందుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో ట్విట్టర్లో నెటిజన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనే వివరాల్లోకి వెళితే..

కొన్ని సీన్స్ బాగున్నాయి అంటూ..

షెహజాదా సినిమాకు కేవలం పాజిటివ్ కామెంట్స్ మాత్రమే కాకుండా నెగటివ్ కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఇక కొందరు సినిమా బాగుంది అంటే మరి కొందరు మాత్రం అంచనాలను అందుకోలేదని అంటున్నారు. అయితే సినిమాలో డైలాగ్స్ తో పాటు కొన్ని సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉన్నాయి అని మరి కొందరు ట్విట్టర్ లో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా సినిమాను ఒకసారి చూడవచ్చు అని కూడా చెబుతున్నారు.

మళ్ళీ చూస్తే అంతగా ఆకట్టుకోదు..

ఈ సినిమాలో స్టోరీ లైన్ కూడా చాలా ఓల్డ్ గా ఉంది అని మరి కొంతమంది బాలీవుడ్ జనాలు పెదవి విరిస్తున్నారు. అంచనాలను అయితే అందుకోలేదు అని ముఖ్యంగా అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో సినిమా చూసిన తర్వాత ఇది మళ్ళీ చూస్తే అంతగా ఆకట్టుకోదు అని ఆ సినిమాలో ఉన్న డ్యాన్స్ మూమెంట్స్ అలాగే మ్యూజిక్ సినిమాలో మాత్రం కనిపించవు అని మరికొందరు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

చాలా యావరేజ్ గా ఉంది

షెహజాదా సినిమా చాలా యావరేజ్ గా ఉంది అని ఈ సినిమాలో కార్తీక్ తన నటనతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో సినిమాతో పోలిస్తే మాత్రం అంతగా మెప్పించలేదు అని రెండిటిని పోల్చి చూస్తే మాత్రం అల్లు అర్జున్ బెస్ట్ అని అంటున్నారు ఇక కృతి సనోన్ పాత్ర కూడా అంతగా ఏమీ ఆకట్టుకోదు అని అంటున్నారు. ఇక దర్శకుడు రోహిత్ దావన్ కథను కరెక్ట్ గా తెరపైకి తీసుకురాలేకపోయాడు అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా.

బన్నీకి తగ్గట్టుగా చేయలేదు


ఈ సినిమాలో అసలైనవి కథ కథనం.. వాటికి తగ్గట్టుగా తెలుగులో ఒరిజినల్ కథలో అల్లు అర్జున్ నటించిన విధానం షెహజాదా సినిమాలో మిస్ అయ్యిందని చెబుతున్నారు. కార్తీక్ ఆర్యన్ తన పాత్రకు కరెక్ట్ గా సెట్ అవ్వలేదు అని అనిపిస్తోందని సినిమాలో ఉండే మ్యూజిక్ దానికి తగ్గట్టుగా డాన్స్ అలాగే చరిష్మా ఇవన్నీ కూడా బిన్నీకి తగ్గట్టుగా కార్తీక్ చేయలేకపోయాడు అని మరి కొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు

థియేటర్స్ ఖాళీగానే..

ఇక మరికొందరు థియేటర్లో సినిమాలను చూస్తూ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సినిమాకు అంతగా బజ్ లేదు అని చాలా వరకు ధియేటర్లు ఖాళీగానే కనిపించాయని అంటున్నారు. నేను అయితే ఒక ఏడు మంది జనాలతో మాత్రమే సినిమా చూశాను అని సినిమా కూడా అంతగా ఏమీ ఆకట్టుకోలేదు అని ఒక నెటిజన్ అయితే పోస్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో ఒరిజినల్ కథకు తగ్గట్టుగా మ్యాజిక్ క్రియేట్ అవ్వలేదు అని కూడా మరి కొందరు కామెంట్ చేశారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X