యువ హీరోకు కరోనావైరస్.. టెన్షన్‌లో కియారా అద్వానీ
కరోనావైరస్ బారిన పడిన సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా యువ హీరో చేరారు. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనావైరస్ సోకినట్టు స్పష్టమైంది. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా కార్తీక్ ఆర్యన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.
తనకు కరోనాపాజిటివ్ అని ప్రరోక్షంగా ప్లస్ సింబల్ పెట్టి తెలియజేశాడు. తన ఆరోగ్యం కోసం దేవుడిన ప్రార్థించండి అంటూ వేడుకొన్నాడు.

అయితే కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి కియారా అద్వానీ, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి లాక్మే ఫ్యాషన్ వీక్ 2021 ఈవెంట్‌లో ర్యాంప్‌పై నడిచారు. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో కియారా అద్వానీ ఆందోళనలో పడిపోయినట్టు సమాచారం. అయితే కియారా అద్వానీ కూడా వైద్య పరీక్షలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్ కలిసి భూల్ భులయ్యా 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కార్తీక్ ఆర్యన్ నటించిన ధమాకా చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి రామ్ మద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











