రణ్‌వీర్ భార్య దీపిక చాలా ఇష్టం అంటూ.. మరోసారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కుర్ర హీరో!
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రణ్‌వీర్‌ని పెళ్లి చేసుకున్న తరువాత కూడా దీపిక యధావిధిగా సినిమాలతో బిజీగా మారింది. ఇక ఆమె అభిమానుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఇటివల ఈ బ్యూటీపై ఒక కుర్ర హీరో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వారి వివాహ బంధంపై కూడా ఆ హీరో కామెంట్ చేశాడు.

బాలీవుడ్ లవర్స్..
దీపిక పదుకోన్ - రణ్ వీర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి లవ్ స్టోరీకి బాలీవుడ్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రెటీస్ అప్పుడప్పుడు ఈ జంటపై కొన్ని కామెంట్స్ చేస్తుంటారు. వారి మధ్య ప్రేమానురాగాలను చూస్తే అలాంటి ప్రేమను పొందాలని అనిపిస్తుందని స్టార్ యాక్టర్స్ కూడా కామెంట్ చేశారు.

కార్తిక్ ఆర్యన్ కామెంట్..
ఇక ఇటీవల ఒక కుర్ర హీరో కూడా దీపిక రణ్ వీర్ ప్రేమపై తనదైన శైలిలో వివరణ ఇస్తూ.. తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ కుర్ర హీరో మరెవరో కాదు. యువ హీరో కార్తీక్ ఆర్యన్. ఇప్పుడిపుడే యూత్ లో మంచి క్రేజ్ అందుకుంటున్న కార్తిక్ దీపికకు పెద్ద అభిమాని అని బాలీవుడ్ లో అందరికి తెలిసిన విషయమే. అయితే దీపిక రణ్ వీర్ పై చూపే ప్రేమ చాలా బావుంటుందని ఈ హీరో కామెంట్ చేశాడు.

పెళ్లిపై క్లారిటీ..
ఇక పెళ్లి పై స్పందించిన ఈ కుర్ర హీరో తనపై వస్తున్న రూమర్స్ కి ఒక్క కామెంట్ తో క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరిని ప్రేమించడం లేదని ఒకవేళ దీపిక లాంటి అమ్మాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని అలాంటి కేరింగ్ అండ్ డార్లింగ్ కావాలని కార్తిక్ ఆర్యన్ తన మనసులోని మాట చెప్పాడు. రణ్ వీర్ ని ఆమె చాలా బాగా చూసుకుంటుందని చెబుతూ తన మనసులోని మాటను బయటపెట్టా
Recommended Video

అలాంటి అమ్మాయే కావాలి..
ఇక ఒక స్టార్ హీరోతో ఈ హీరో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వస్తున్నప్పటికి కార్తిక్ ఆ విషయాల గురించి పెద్దగా స్పందించడం లేదు. పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ రాగా తనకు దీపిక పదుకోన్ లాంటి అమ్మయి కోసం ఎదురుచూస్తున్నట్లు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ కుర్ర హీరో సింగిల్ గానే ఉన్నాడని బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











