twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జమ్మూ కశ్మీర్‌లో బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హతం.. కుటుంబానికి కూడా అర్థంకానిది అదే!

    |

    టీనేజి పిల్లల మదిలో అనేక రకాల ఆలోచనలు మొదలవుతాయి. వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కుటుంబం, ఉపాధాయ్యులపై ఉంటుంది. కానీ కొందరు పిల్లలు అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులై జీవితాలని నాశనం చేసుకుంటుంటారు. అలాంటి ఘటనే జమ్మూ కాశ్మీర్ లో చేటు చేసుకుంది. కొన్ని రోజులు క్రితం బాలీవడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ యువకుడు ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

    పక్కా సమాచారంతో

    పక్కా సమాచారంతో

    జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు కొద్ది దూరంలో ఉన్నసోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భారత దళాలకు సమాచారం అందింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఇండియన్ ఆర్మీ పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. 8 గంటల పాటు ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో ఉద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆ ఇద్దరి గురించి ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతి చెందినది షకీబ్ బిలాల్, అతని స్నేహితుడు అని తేలింది.

    ఇంటి నుంచి పారిపోయి

    ఇంటి నుంచి పారిపోయి


    షకీబ్ బిలాల్, అతని స్నేహితుడు కలసి ఆగష్టు 31 న ఇంటి నుంచి పారిపోయారు. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాలో చేరినట్లు తెలిసింది. వీరిద్దరూ ఉగ్రవాదులుగా ఎందుకు మారారు అనే విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాలేదు. నెలరోజుల పాటు వీరి షకీబ్ బిలాల్ గురించి వెతికిన తరువాత అతడు ఉగ్రవాదుల స్థావరాలకు వెళ్లినట్లు తెలిసింది. షకీబ్ బిలాల్ నుంచి తాము ఇలాంటి చర్యలు ఊహించలేదని అతడి మావయ్య మీడియాతో తెలిపారు.

    తెలివైన విద్యార్థి

    తెలివైన విద్యార్థి


    షకీబ్ బిలాల్ కు ఇంజనీరింగ్ చదవాలని కోరిక ఉండేది. బిలాల్ చాలా బాగా చదువుతాడు. 10వ తరగతిలో బిలాల్ డిస్ట్రింక్షన్ లో పాస్ అయ్యాడు. ప్రస్తుతం 11 వ తరగతిలో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగంలో విద్యని అభ్యసిస్తున్నట్లు అతడి మావయ్య తెలిపారు. బిలాల్ కు నటన, ఫుట్ బాల్ ఆసక్తి ఉందని తెలిపారు. నటనపై ఉన్న ఆసక్తితో ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించాడు.

    డిస్ట్రిబ్యూటర్‌పై చేయి చేసుకున్న బెల్లంకొండ సురేష్.. మ్యాటర్ వేడెక్కడంతో? డిస్ట్రిబ్యూటర్‌పై చేయి చేసుకున్న బెల్లంకొండ సురేష్.. మ్యాటర్ వేడెక్కడంతో?

    షాహిద్ కపూర్ చిత్రంలో

    షాహిద్ కపూర్ చిత్రంలో


    2014 లో స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన హైదర్ చిత్రంలో బిలాల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని అతడి మావయ్య తెలిపారు. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని విషయాల్లో తెలివిగా, చురుగ్గా ఉండే బిలాల్ ఉగ్రవాదం పట్ల ఎలా ఆకర్షితుడయ్యాడో తమకు అంతుచిక్కడం లేదని అతడి మామ మీడియాకు వివరించారు. బిలాల్ ప్రస్తుత వయసు 17 ఏళ్లే. బిలాల్ తో పాటు మృతి చెందిన అతడి స్నేహితుడు మదసిర్ అహమ్మద్ వయస్సు 14 ఏళ్ళు.

    English summary
    Kashmiri teen shot dead in Mujgund encounter on December 9 had done a cameo in film Haider. Saqib Bilal was a PCM student in Class 11. Moreover, he is said to have been a huge football fan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X