ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ.. 250 చిత్రాల్లో నటించి..!
ప్రముఖ బాలీవుడ్ నటి సులోచన లత్కర్ ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. ఆమె మరణవార్తతో హిందీ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆమెతో అనుబంధమున్న సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. సులోచన లత్కర్ సేవలను తలచుకొంటూ శ్రద్దాంజలి ఘటించారు. సులోచన లత్కర్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోకి వెళితే..
సులోచన లత్కర్ కర్ణాటకలోని ఖదాలత్‌లో జూలై 30 తేదీన జన్మించారు. ఆమె 1946 లో నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మరాఠీ సినిమా రంగంలో విశేషంగా రాణించినప్పటికీ ఆమెకు హిందీ సినిమా రంగంలోనే మంచి గుర్తింపు లభించింది. ఆమె మరాఠీ సినీ రంగంలో 250 సినిమాలకుపైగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు.

ససుర్వాస్, వాహిన చియా బంగంద్యా, గోరా ఔర్ కాలా, సంపూర్ణ రామాయణం, జీవచ్చ శక లాంటి అద్బుతమైన చిత్రాల్లో నటించి మంచి పాపులారిటిని అభిమానులను సంపాదించుకొన్నారు. సులోచన లత్కర్ తల్లి పాత్రలకు పెట్టింది పేరు. 1959 నుంచి 1995 వరకు నిర్విరామంగా సినిమాల్లో నటించారు. దిల్ దేఖే దోఖో, కటీ పతంగ్, మేరే జీవన్ సాథి సినిమాల్లో ఆమె నటన సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు.
సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సులోచన్ లత్కర్‌కు కేంద్ర ప్రభుత్వం అరుదైన పురస్కారంతో గౌరవించింది. 1999లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. 2004లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను మహారాష్ట్ర భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
కొద్ది నెలులుగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సులోచన లత్కర్‌ను ఇటవల ముంబైలోని దాదర్‌లోని సుశ్రుత హాస్పిటల్‌లో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం అంటే.. జూన్ 4వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ఈ లోకం వీడి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. సలోచన లత్కర్ మరణానికి సంతాపం తెలియచేస్తూ సోషల్ మీడియాలో పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











