క్రికెట్ పై కత్రినా మోజు... లాక్ డౌన్ లో ఆటలేదని ఆవేదన

మామూలుగా క్రికెట్ ఆట లేనిదే, దేశంలోని జనాలకు ఒక్కరోజు కూడా గడవదు. అలాంటిది ఏకంగా నాలుగు నెలలు గడిచిపోయాయి. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు బీసీసీఐ ఐపీఎల్ కు తెరలేపుతుందా అని ఎదురుచూస్తుండగా, ఇప్పుడు వీరి సరసకు కత్రినా కైఫ్ కూడా చేరిపోయింది.

నిజమే, కత్రినాలోని ఈ యాంగిల్ ఎప్పుడూ ఫ్యాన్స్ చూడలేదు. కానీ, అమ్మడిలో పెద్ద క్రికెట్ ఫ్యాన్ దాగి ఉంది. అంటే మామూలుగా క్రికెట్ మ్యాచ్ లు చూసి మురిసిపోయి ఊగిపోయే టైప్ కాదు మరి. వీలు చిక్కితే బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగే టైప్ అన్నమాట. అందుకే అమ్మడికి ఇది నిజంగానే పరీక్షా కాలంగా మారింది.

Katrina goes down memory lane, Says shes missing cricket

ఇంతకూ మ్యాటర్ ఏమిటంటే స్వతహాగా క్రికెట్ లవర్ అయిన కత్రినా లాక్ డౌన్ లో క్రికెట్ ను చాలా మిస్ అవుతోంది అట. ఓ వైపు కనీసం చూసి ఎంజాయ్ చేద్దామన్నా లాక్ డౌన్ అందుకు అనుకూలించడంలేదు. పోనీ సరదాగా నలుగురితో కలసి ఆడుకుందామన్నా కరోనా మహమ్మారి ఇల్లు కదలనివ్వడంలేదు. దీంతో పాతజ్ఞాపకాలతోనే సరిపెట్టుకుంటోంది అమ్మడు.

తన పాత ఫొటోల్లో సల్వార్ కమీజ్ వేసుకుని క్రికెట్ ఆడుకుంటోన్న ఫొటోలు దొరకడంతో వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు ఐ ట్రీట్ ఇచ్చింది. ఇక అమ్మడు ఫొటోలను పోస్ట్ చేసిన కాసేపటికే అవి వైరల్ గా మారడం మనకు కొత్తేమీ కాదు. ఏమైనా క్రికెట్ అభిమానులు కాస్త చల్ల బడాలంటే.. ఐపీఎల్ అయినా కాస్త తొందరగా మొదలవ్వాల్సిందే మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X