twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరిలా మనిషినే.. నాకు ఆ అవసరం, కోరికలు ఉండవా.. కత్రినా కైఫ్ షాకింగ్..

    |

    బాలీవుడ్‌లో పెళ్లి సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2017లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెళ్లితో ప్రారంభమ తాజాగా దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్‌ పెళ్లితో కాస్త ఇంటర్వెల్ పడింది. త్వరలనే వరుణ్ ధావన్, నటషా దలాల్ పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్ తన పెళ్లి గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కత్రినా కైఫ్ పెళ్లి గురించి ఏం చెప్పారంటే..

     రణ్‌బీర్ కపూర్‌తో అఫైర్

    రణ్‌బీర్ కపూర్‌తో అఫైర్

    గతంలో కత్రినా కైఫ్, రణ్‌బీర్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. పెళ్లి వరకు వచ్చిన వారి ప్రేమ వ్యవహారం అనూహ్యంగా అటకెక్కింది. రణ్‌బీర్‌తో బ్రేకప్ తర్వాత ఒంటరిగానే ఉంటున్నది. ఇప్పుడంతా కేవలం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది. అఫైర్లకు కత్రినా దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నది.

     బ్రేకప్ తర్వాత రణ్‌బీర్ కపూర్

    బ్రేకప్ తర్వాత రణ్‌బీర్ కపూర్

    కత్రినా కైఫ్‌తో బ్రేకప్ తర్వాత ప్రస్తుతం రణ్‌బీర్, అలియా భట్ ప్రేమలో పడ్డారు. బ్రహ్మస్త్రం సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. త్వరలోనే పెళ్లికి వీరు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇరు కుటుంబాలు రణ్‌బీర్, అలియాభట్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

    ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడం మంచిదే.. నన్ను తిట్టడానికి ఇదొక అవకాశం.. స్టార్ హీరో!ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడం మంచిదే.. నన్ను తిట్టడానికి ఇదొక అవకాశం.. స్టార్ హీరో!

     నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది

    నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది

    బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం మంచిదే. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నేను కూడా ప్రతీ ఒక్కరి మాదిరిగా మనిషినే. నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలని ఉండదా? నన్నెందుకు వేరుగా చూస్తారు. అలా నన్ను చూడకూడదు అంటూ కత్రినా కైఫ్ పేర్కొన్నది.

     సల్మాన్ ఖాన్‌తో కత్రినా కైఫ్

    సల్మాన్ ఖాన్‌తో కత్రినా కైఫ్

    ఇక కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. తాజాగా షారుక్ ఖాన్, అనుష్క శర్మతో కలిసి జీరో సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా కత్రినా నటనకు మంచి పేరు వచ్చింది. మద్యానికి బానిసైన యువతి పాత్రలో కత్రినా కైఫ్ నటించింది. ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించే భరత్ అనే సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తున్నది. ఈ చిత్రం రంజాన్‌కు రిలీజ్ కానున్నది.

    English summary
    Bollywood Heroine Katrina Kaif, who is single after her break-up with Ranbir Kapoor, opened up on everyone getting married in Bollywood. Katrina said, "I am like everyone's getting married, wait... don't leave me behind."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X