ప్రియాంక చోప్రా డ్రెస్‌పై ట్రోల్స్.. సరిగా చూడలేదు.. కత్రినా కౌంటర్
సినీ రంగంలో ఒక్కోదేశంలోఒక్కో అవార్డులు ఇస్తుంటారు. అన్నింటికంటే ఆస్కార్ అవార్డును అత్యుత్తమ అవార్డుగా పరిగణిస్తారు.. ఆపై గ్రామీ, గోల్డెన్ గ్లోబ్ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులున్నాయి. వీటిలో ఈ సారి గ్రామీ అవార్డు వేడుకలు అందర్నీ ఆకర్షించాయి. ఆస్కార్ వేడుకలకు తారలు ఎలా ముస్తాబై వస్తారో.. ఈ ఈవెంట్‌కు సైతం అలానే వచ్చారు. అయితే అంతర్జాతీయ తారగా మారిన ప్రియాంక అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.

అంతర్జాతీయ తార..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో నటించడం, నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోవడంతో అమెరికాలో సెటిలైపోయింది. ఇక అక్కడి ప్రాజెక్ట్‌లతో బిజీ కావడంతో అంతర్జాతీయ తారగా ప్రియాంకకు ఎనలేని ఫాలోయింగ్ ఏర్పడింది.

ప్రియానిక్ జంటగా..
ఎక్కడికి వెళ్లినా ప్రియాంక్, నిక్ జోనాస్ జంటగానే వెళ్తారు. ఆ మధ్య జరిగిన గ్రామీ అవార్డుల వేడుకల్లోనూ ఇద్దరూ కలిసే పాల్గొన్నారు. ఆ వేడుకల్లో ఇద్దరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు. అందులో కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి.

ప్రియాంక డ్రెస్‌పై ట్రోల్స్..
ప్రియాంక ధరించిన ఆ డ్రెస్‌లో ఎదభాగం కనిపించడం, చూడటానికి ఎబ్బెట్టుగా ఉండటంతో ఆ డ్రెస్సేంటని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. ప్రియాంకకు డ్రెస్ సెన్స్ లేదని చీవాట్లు పెట్టారు. ఓ రెండు మూడు రోజులు ఈ టాపిక్‌పైనే చర్చలు జరిగాయి.
Recommended Video


కత్రినా మద్దతు..
ఇక ఇదే విషయమై కత్రినాను అడిగితే.. ప్రియాంక డ్రెస్‌పై వచ్చిన ట్రోల్స్ గురించి తనకు తెలీదని చెప్పుకొచ్చింది. అయితే ఆమె ధరించిన డ్రెస్, ఆ ఫోటోలను తాను చూశానని, చాలా బాగుందని తెలిపింది. కామెంట్ చేసే వారెవరో ఆమె ఫోటోలను సరిగా చూడలేదేమోనని కౌంటర్ వేసింది.


Click it and Unblock the Notifications











