అర్ధరాత్రి రహస్యంగా కలుసుకున్న హీరో, హీరోయిన్లు.. కెమెరా కంటికి చిక్కిన జంట

ప్రేమలో విఫలం కావడం.. కొన్నేళ్లు బాధపడటం.. మళ్లీ ప్రేమలో పడటం.. ఇవన్నీ ఓ సర్కిల్‌లా జరిగిపోతుంటాయి జీవితంలో. అయితే సామాన్య జనంలో ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ సెలెబ్రిటీలు, అందులో పైగా హీరోయిన్లకు సంబంధించిన వ్యవహారాలైతే.. అందరి చూపు వాటివైపే ఉంటుంది. దక్షిణాదిలో నయనతార వ్యవహారంపై అందరి కన్ను పడితే.. ఉత్తరాదిన కత్రినా కైఫ్ కదలికలపై అందరూ ఆసక్తిని చూపిస్తుంటారు.

ప్రేమలో విఫలమవుతూ..

ప్రేమలో విఫలమవుతూ..

ఈ అమ్మడు ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైంది. ఇప్పుడు మరో యువహీరోతో ప్రేమలో పడడం హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్‌తో లవ్ బ్రేకప్ అయ్యాక చాక్లెట్ బాయ్ రణబీర్‌తో నిండా ప్రేమలో మునిగింది. పెళ్లి పీఠల వరకు వెళ్తుందని అంతా భావించారు. కానీ రణబీర్‌తో కూడా బ్రేకప్ అయింది. చాలా కాలంగా ఒంటరిగానే ఉంటూ వచ్చిన కత్రినాకు సల్మాన్ అవకాశాలు ఇస్తూ వచ్చాడు.

మళ్లీ యంగ్ హీరోతో

మళ్లీ యంగ్ హీరోతో

గత కొంతకాలం నుంచి విక్కీ కౌశల్‌తో తిరుగుతున్న ఫోటోలు లీకవుతూ వస్తున్నాయి. ఇంతకుముందు దీపావళి పార్టీలో తళుక్కుమన్న ఈ జంట.. అటుపైనా డిన్నర్ డేట్ల పేరుతో రెస్టారెంట్లలో జంటగా కనిపించింది. ఇక అర్థరాత్రి వేళ ఆ ఇద్దరి స్నేహాన్ని అక్కడి చెఫ్‌లు ఫోటోలు వీడియోలు తీసి ఆన్ లైన్‌లో పెట్టేయడంతో గుట్టు బయటపడిపోయింది.

తాజాగా మరోసారి..

తాజాగా మరోసారి..

తాజాగా మరోసారి విక్కీ కౌశల్ ని అర్థరాత్రి రహస్యంగా కలుసుకోవడం ఆ ఫోటోలు లీకవ్వడం హీటెక్కిస్తోంది. మంగళవారం రాత్రి అత్యంత రహస్యంగా ఈ జంట వేర్వేరు కార్లలో ముంబైలోని ఓ స్నేహితుడి ఇంటికి వచ్చి కలవడం వేడెక్కిస్తోంది. అయితే ఇంతగా ఈ వార్తలు వైరల్ అవుతున్న వీరిద్దరు మాత్రం నోరు విప్పడం లేదు.

Recommended Video

Katrina Kaif On Replacing Priyanka Chopra In Bharat Movie
 ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీ..

ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీ..

కత్రినా, విక్కీ కౌశల్‌లు తమ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. గతేడాది సల్మాన్ నటించిన భారత్ చిత్రంలో కత్రినా మెరిసింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా వస్తోన్న సూర్యవంశీ చిత్రంలోనూ నటిస్తోంది. యూరీ సినిమాతో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విక్కీ.. బూత్, సర్దార్ ఉద్దంసింగ్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X