మరోసారి పట్టుబడ్డారు.. ప్రియురాలి జుట్టును సరిచేస్తున్న హీరో.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ కొత్తజంట

ప్రేమలకు, బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది బాలీవుడ్. హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, మళ్లీ బ్రేకప్ చెప్పుకోవడం, మరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేయడం కామన్ అయిపోయింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఇలా ఎంతో మంది ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలిన వారే. ఎంత మంది ఉన్నా కూడా.. కత్రినా వ్యవహారం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.

కత్రినా ప్రేమ వ్యవహారం..

కత్రినా ప్రేమ వ్యవహారం..

కత్రినా ప్రేమ వ్యవహారంపై బాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కత్రినా ప్రేమ వ్యవహారంలో ఎన్నో మలుపులు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్‌తో స్నేహబంధం, రణ్‌బీర్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలోకి కూరుకుపోవడం, మళ్లీ తేరుకుని సినీ లైఫ్‌పై ఫోకస్ పెట్టడం అందరికీ తెలిసిందే.

అవకాశాలిచ్చే సల్మాన్..

అవకాశాలిచ్చే సల్మాన్..

తన స్నేహితురాలైన కత్రినాకు ఎలాంటి సాయమైనా చేస్తాడు సల్లూ భాయ్. కెరీర్ డౌన్ ఫాల్‌లో ఉన్న ప్రతీ సారి సల్మాన్ ఆదుకుంటూ వస్తూనే ఉన్నాడు. అయితే సినీ కెరీర్‌కు ఏ ఢోకా లేని కత్రినా.. ప్రస్తుతం ఓ యువ హీరోతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

పలుమార్లు జంటగా..

కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంటగా పలుమార్లు కెమెరా కంటికి చిక్కారు. అర్ధరాత్రిళ్లు జంటగా విహరిస్తుంటారు. అయితే ఇదే విషయమై కత్రినాను ప్రశ్నిస్తే.. ‘అది నా వ్యక్తిగతం, సెలెబ్రిటీలు కావడంతో మా పర్సనల్ లైఫ్‌ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిని చూపుతారు.. కానీ నాకు ఆ విషయాలు బయటకు చెప్పడం ఇష్టముండద'ని చెప్పుకొచ్చింది.

Recommended Video

Radhika Apte Reveals Vicky Kaushal Relationship With Malavika Mohanan || Filmibeat Telugu
హోలీ వేడుకల్లో..

హోలీ వేడుకల్లో..

ఈషా అంబానీ ఏర్పాటు చేసిన ప్రీ హోలీ వేడుకల్లో బాలీవుడ్ తారాగణం పాల్గొంది. ఇందులో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, కత్రినా, విక్కీ కౌశల్ వంటివారు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ వేడుకల్లో కత్రినా జుట్టును సరిచేస్తూ.. విక్కీ మళ్లీ వైరల్ అయ్యాడు. ఇలా వీరి మధ్య ఉన్న బంధాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X