సల్మాన్‌తో అలా చేస్తూ పట్టుబడిన కత్రినా కైఫ్.. ఎలాంటి చిలిపి పని చేసిందంటే..!
బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్, బ్యూటీ కత్రినా కైఫ్ ఒకప్పుడు రంజుగా ప్రేమాయణం సాగించారు. ఆ తర్వాత ఏమైందో వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులుగానే ఉంటున్నారు. తాజాగా వారిద్దరూ భారత్ అనే చిత్రంలో కలిసి నటిస్తున్నది. అయితే కత్రినా చేసిన చిలిపి పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే కత్రినా చేసిన అల్లరి పని ఏమిటంటే..

కెమెరాతో కత్రినా జిమ్మిక్కు
అందాల భామ కత్రినా కైఫ్‌కు ఫోటోగ్రఫీ హ్యాబీ. షూటింగ్ సమయంలో సెట్‌లో ఫోటోలు తీస్తూ తోటి నటీనటులను ఆటపట్టిస్తుంటుంది. గతంలో తన సహచర నటుడు సునీల్ గ్రోవర్‌ను తీసిన ఫొటో చాలా కాలం ట్రెండింగ్ అయింది.

సల్మాన్‌ఖాన్‌కు తెలియకుండా
తాజాగా భారత్ షూటింగ్‌లో కూడా కెమెరాకు పనిచెప్పింది. సల్మాన్ నలుచుని ఉండగా వెనుక నుంచి తెలియకుండా క్లిక్ మనిపించింది. అలా చేస్తుండగా సల్మాన్ బావ, నటుడు అతుల్ అగ్నిహోత్రి తన కెమెరాతో వారిద్దరిని బంధించాడు. తాను తీసిన ఫొటోను అతుల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రెండింగ్ మారింది.

సల్మాన్, కత్రినా ఫ్రెండ్స్
సల్మాన్‌ను కత్రినా ఫొటో తీస్తుండగా తీసిన ఫొటో అది. సల్మాన్‌కు తెలియకుండా కత్రినా, ఆమెకు తెలియకుండా నేను ఫొటో తీశాను. వారిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని అతుల్ అగ్నిహోత్రి కామెంట్ చేశాడు.

భారత్‌లోకి సడెన్ కత్రినా ఎంట్రీ
భారత్ చిత్రంలో కత్రినా కైఫ్ నటించడం అనుకోకుండా జరిగింది. ప్రియాంక చోప్రా ఈ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో కత్రినాకు సల్మాన్ పక్కన నటించే అవకాశం దక్కింది. నికి జోనాస్‌తో పెళ్లి కారణంగా ప్రియాంక సినిమా నుంచి తప్పుకోవడం వివాదంగా మారిన విషయం తెలిసిందే.

సల్మాన్ ఖాన్‌తో నటించడం
భారత్ సినిమాలో నటించే అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నాను. ప్రియాంక వదిలేసిన పాత్రను చేస్తున్నానే బాధ లేదు. సినిమా కథ నచ్చడంతోనే ఒప్పుకొన్నాను. సల్మాన్‌తో నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు అని కత్రినా చెప్పింది. గతంలో వారిద్దరూ నటించిన టైగర్ జిందా హై చిత్రం భారీ సక్సెస్‌ను అందుకొన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











