నాకు లిప్ కిస్ పెట్టాలంటే అదృష్టం ఉండాలి.. ఆ లక్కీ ఛాన్స్ అతడికి రెండుసార్లు!

షారుఖ్ ఖాన్ మరో విభిన్న పాత్రలో నటిస్తున్న చిత్రం జీరో. ఈ చిత్రంలో షారుఖ్ శరీరం సరిగా ఎదగని యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జీరో మూవీ డిసెంబర్ 21న విడుదలవుతుండటంతో చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జీరో చిత్రంలోని లిప్ లాక్ సన్నివేశాల గురించి హాట్ కామెంట్స్ చేసింది. 35 ఏళ్ల వయసులో కూడా కత్రినా అమిర్, షారుఖ్, సల్మాన్ సరసన నటిస్తూ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది.

రెండు దశాబ్దాల పాటు

రెండు దశాబ్దాల పాటు

తాను లిప్ లాక్ సన్నివేశాల్లో నటించనని షారుఖ్ రెండు దశాబ్దాల పాటు భీష్మించుకు కూర్చున్నాడు. కానీ తన నిర్ణయాన్ని బ్రేక్ చేస్తూ షారుఖ్ 2012లో యాష్ చోప్రా తెరకెక్కించిన జబ్ తక్ హై జాన్ చిత్రంలో లిప్ లాక్ సీన్ లో నటించడానికి షారుఖ్ అంగీకరించాడు. ఆ చిత్రంలో కత్రినా హీరోయిన్ గా నటించింది. మరోమారు జీరో చిత్రంలో షారుఖ్, కత్రినా లిప్ లాక్ సన్నివేశంలో నటించారు.

ఆ అవకాశం మీకే దక్కింది

ఆ అవకాశం మీకే దక్కింది

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కత్రినాకు మీడియా నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అసలు లిప్ కిస్ అంటేనే ఆమడ దూరం ఉండే షారుఖ్ ఖాన్ తో మీరు రెండు సార్లు ఆ సన్నివేశాల్లో నటించారు. షారుఖ్ ఖాన్ తో లిప్ కిస్ సన్నివేశంలో నటించడం మీ అదృష్టంగా భావిస్తున్నారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సరదాగా మాట్లాడుతూనే కత్రినా అదిరిపోయి ఆన్సర్ ఇచ్చింది.

అదృష్టం ఉండాలి

అదృష్టం ఉండాలి

నేను అదృష్టంగా భావిస్తున్నాని మీకు ఎవరు చెప్పారు. నాతో లిప్ కిస్ సన్నివేశంలో నటించాలంటేనే వాళ్లకు అదృష్టం ఉండాలి. కాబట్టి నేను కాదు.. షారుఖ్ ఖాన్ అదృష్ట వంతుడు అంటూ సరదగా వ్యాఖ్యానించింది. మరగుజ్జు పాత్రలో షారుఖ్, అందాల సుందరిలా కత్రినా లిప్ కిస్ సన్నివేశానికి సంబందించిన పోస్టర్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. త్వరలో సినిమా విడుదల కానుండడంతో వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొని ఉంది.

మరణించిన శ్రీదేవిని ఈ చిత్రంలో

మరణించిన శ్రీదేవిని ఈ చిత్రంలో

ఈ ఏడాది ఆరంభంలో అతిలోక సుందరి శ్రీదేవి అనూహ్యపరిణామాల మధ్య మరణించిన సంగతి తెలిసిందే. ఈ నటించిన చివరి చిత్రంగా జీరో మిగిలిపోనుంది. చిన్న కామియో పాత్రలో శ్రీదేవి ఈ చిత్రంలో నటించింది. ఇక కత్రినా కైఫ్ బబిత కుమారిగా నటించింది. అనుష్క శర్మ పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X