Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
మరీ ఇంత ఓపెన్‌గా పెడితే ఎలా కత్రినా! కుర్రకారు బెంగెట్టుకోరు?
బాలీవుడ్ హీరోయిన్ల అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాలా! వెండితెర అవకాశం వస్తే చాలు తమ అందాలను మార్కెట్ లో పెట్టేయడంలో ఏ మాత్రం వెనుకాడరు బాలీవుడ్ భామలు. చిన్న హీరోయిన్స్ అయితే మరీనూ. ఇక బడా స్టార్స్‌గా వెలుగొందుతున్న హీరోయిన్ల విషయానికొస్తే కత్రినా కైఫ్ అందాలు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. కేవలం ఉత్తరాదినే కాదు.. దేశమంతా అందాలు, చిందులతో సెగలు పుట్టించడం కేవలం కత్రినాకే సాధ్యం.
దేశమంతా కత్రినా అందాలకు దాసోహమే అంటారు. కేవలం సినిమాల్లోనే గాక సోషల్ మీడియాలో కూడా తన చర్మ సౌందర్యాన్ని ఎక్స్పోజ్ చేయడంలో వెనకాడే ప్రసక్తే లేదు అన్నట్లుగా ఉంటుంది కత్రినా. తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది కత్రినా కైఫ్. రకరకాల దుస్తులు మార్చి పొదుపుగా ధరించిన బట్టల్లో తన సెగలు పుట్టించే సోకులను బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అంతటితో ఆగక ఆ గ్యాలరీ నుంచి కొచ్చి హాట్ పిక్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది కత్రినా. దీంతో ఈ పిక్స్ యమ వైరల్ అవుతూ ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్‌ని షేక్ చేస్తున్నాయి.
అందులో బ్లాక్ కలర్ టాప్ వేసుకున్న పిక్ బాగా హైలైట్ అవుతోంది. ఈ పిక్ లో కత్రినా తన అందాలను ఏమాత్రం పొదుపు పాటించకుండా ఒడుపుగా వడ్డించేసింది. మైకం కమ్మే కళ్ళు, విరబోసిన కురులు, నల్లటి చిన్ని దుస్తుల్లో మెరుపు లాంటి కత్రినా సోయగాలు చూసి తట్టుకోలేక పోతున్నారు నెటిజన్లు. రెప్పపాటు సమయం కూడా ఆలోచించకుండా యమ హాట్ హాట్ కామెంట్స్ చేసేస్తున్నారు. ఫిలింఫేర్‌కు అందాల పండగ, ఎంతమంది వచ్చి పోయినా కత్రినా అందాలు ఎప్పటికీ ప్రత్యేకమే, కిల్లింగ్ లుక్స్, యమ సెక్సీ, మరీ ఇంత ఓపెన్‌గా పెడితే కుర్రకారు బెంగెట్టుకోదు! అంటూ ఆ పిక్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కత్రినా నటించిన 'భారత్' మూవీ మరి కొద్దీ రోజుల్లోనే విడుదల కానున్న నేపథ్యంలో కత్రినా అందాలు సినిమాకు ఫుల్ ప్రమోషన్ అవుతున్నాయి.