twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపేస్తామని కత్రినాకైఫ్ కు హెచ్చరికలు.. పోలీస్ స్టేషన్ లో విక్కీ కౌషల్ పిర్యాదు!

    |

    సినిమా ప్రపంచంలో కొంతమంది నటీనటులు ఊహించిన విధంగా కొన్ని కామెంట్స్ ద్వారా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొందరు ఇలాంటి తప్పులు చేయకపోయినా కూడా అనవసరమైన బెదిరింపులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక రీసెంట్ గా కత్రినా కైఫ్ విషయంలో కూడా అలానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమెను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడడంతో భర్త విక్కీ కౌశల్ వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే..

    ఇదివరకే సల్మాన్ కు హెచ్చరికలు

    ఇదివరకే సల్మాన్ కు హెచ్చరికలు

    గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినీ తారల బెదిరించడం లేకపోతే దాడులు జరగడం వంటి చేదు అనుభవాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ అలాగే అతని కుటుంబ సభ్యులను కూడా చంపేస్తాము అంటూ ఒక గ్యాంగ్ స్టార్ ఇచ్చిన వార్నింగ్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయాన్ని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకొని కేసు కూడా నమోదు చేశారు.

    కత్రినా కైఫ్

    కత్రినా కైఫ్


    అయితే ఇటీవల కత్రినా కైఫ్ ను కూడా చంపేస్తామని సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారుతున్నాయి. కత్రినా కైఫ్ తో పాటు ఆమె సన్నిహితులపై కూడా దాడులు చేస్తామని కొందరు బెదిరించినట్లుగా తెలుస్తోంది.

    విక్కీ కౌషల్ పిర్యాదు

    విక్కీ కౌషల్ పిర్యాదు

    అయితే కత్రినా కైఫ్ వచ్చిన బెదిరింపు సోషల్ మీడియా కామెంట్ పై ఇంతవరకు ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో మాత్రం విక్కీ కౌశల్ ముందస్తు జాగ్రత్తగానే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ముంబైలోని ఒక పోలీస్ స్టేషన్ లో విక్కీ కౌశల్ తనకు తెలిసిన సన్నిహితుల ద్వారా హెచ్చరికల గురించి పూర్తిగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

     కాంట్రవర్సీ లేకుండా..

    కాంట్రవర్సీ లేకుండా..

    గతంలో చాలామంది సెలబ్రిటీలు ఇదే తరహాలో కొన్ని హెచ్చరికలకు సంబంధించిన ఫోన్ కాల్స్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే అందులో చాలా వరకు సినీ తారలు ఎదో ఒక రకంగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తేనే అలాంటి బెదిరింపు కాల్స్ ఎదుర్కొనేవారు. కానీ కత్రినా కైఫ్ మాత్రం ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఉండే హీరోయిన్. మరి అలాంటి హీరోయిన్ పై ఎవరికి కక్ష్య ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే అప్పుడప్పుడు ఆకతాయిలు ఇలా చేసే ఛాన్స్ ఉన్నా కూడా పోలీసులు ఇలాంటి విషయాన్ని తీసుకోవడం లేదట. మరి ఈ కేసు విషయంలో ఏం తెలుస్తారో చూడాలి.

    ప్రెగ్నెంట్ గా కత్రినా?

    ప్రెగ్నెంట్ గా కత్రినా?

    విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నిల్లుగా ప్రేమలు మునిగి తేలిన ఈ జంట రీసెంట్ గా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుని సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. అంతేకాకుండా కత్రినా కైఫ్ తల్లి కాబోతోంది అని కూడా కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇంకా విషయంపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఇంతలో కొంతమంది ఈ నవ దంపతులపై దాడులు చేస్తామని సోషల్ మీడియాలో హెచ్చరికలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

    English summary
    Katrina kaif husband Vicky Kaushal police complaint on get death threats
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X