Katrina Kaif: 2012లోనే తన పెళ్లి కల గురించి క్లారిటీ ఇచ్చిన కత్రినా.. వైరల్ అవుతున్న ట్వీట్!
బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ పెళ్లిపై గత కొన్ని రోజులుగా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహం జరగనున్నట్లు ముందుగానే క్లారిటీ వచ్చేసింది. ఇక సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌లో గ్రాండ్ రాయల్ వెడ్డింగ్ కోసం అన్ని ఏర్పాట్లను వారం రోజుల ముందే ఏర్పాటు చేశారు. అయితే 2012 లోనే కత్రినా తన పెళ్లి గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేయగా ఇప్పుడు అదే నిజమయ్యింది.

గెస్టులు ఎంతమంది అంటే
గ్రాండ్ గా రాయల్ గా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు అతిధుల కోసం పలు ఆంక్షలు విధించడంతో పాటు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో సహా 400 మంది అతిథులు హాజరుకానున్నారు. అందులో అంబానీ ఫ్యామిలీ కూడా రానున్నట్లు సమాచారం.

2012లో కోరుకున్న కత్రినా
2012 లో కత్రినాకు సంబంధించిన పాత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ ఛానెల్ కత్రినా చెప్పినట్లుగా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.ట్వీట్‌లో, కత్రినా, ' నేను హవేలీలో రాయల్ ఇండియన్ స్టైల్‌లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని తెలిపిందట. ఒక విదంగా అది పదేళ్ల కోరిక అయినప్పటికీ ప్రస్తుతం కత్రినా తన కలను నిజం చేసుకుంటోందని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

100కోట్ల డీల్
మొబైల్ ఫోన్‌లు పూర్తిగా నిషేధించబడ్డాయట. అతిథులు రిసార్ట్‌లోకి చెక్-ఇన్ చేయడానికి రహస్య కోడ్‌లను కలిగి ఉంటారట. అయితే ఒక ప్రముఖ OTT ప్లాట్‌ఫాం రూ. 100 కోట్లతో ఈ ఈవెంట్ యొక్క పూర్తి వీడియో ఫుటేజ్ స్ట్రీమింగ్ హక్కులను పొందడానికి ట్రై చేస్తున్నట్లు టాక్. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లిపై ఊహాగానాలు మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ మీడియా పూర్తిగా ఫోకస్ అయ్యింది.

బిగ్గెస్ట్ డీల్ క్లోజ్?
ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఈ స్టార్ కపుల్ డీల్ ను 100 కోట్ల రూపాయలకు క్లోజ్ చేసుకొనున్నారని వార్తలు వస్తున్నాయి. OTT ప్లాట్‌ఫారమ్ ఈ వివాహానికి సంబంధించిన మొత్తం ఫుటేజ్, చిత్రాలు మరియు కంటెంట్‌పై పూర్తి హక్కులను కలిగి ఉంటుందట. నమ్మడానికి కాస్త డౌట్ గానే ఉన్నా ఒకవేళ నిజమైతే సెలబ్రిటీల పెళ్లిళ్లలో ఇదో కొత్త రికార్డు అని చెప్పవచ్చు. గతంలో కూడా ఇలాంటి బిజినెస్ డీల్స్ తో పలువురు సెలబ్రెటీలు భారీ లాభాలను అందుకున్నారు.
Recommended Video

కొంతమంది స్టార్స్ మాత్రమే..
మొత్తానికి స్టార్ కపుల్స్ వారి ఆలోచనలకు తగ్గట్టుగా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక కత్రినా కైఫ్ తన సినీ కెరీర్ ను ఏ విదంగా కొనసాగిస్తుందో చూడాలి. ఇక పెళ్లి వేడుకకి బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు కొంతమంది మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ , అక్షయ్ కుమార్ తో పాటు పలువురు వ్యాపారవేత్తలు


Click it and Unblock the Notifications











