పెళ్లికి ముందే కత్రినా కైఫ్ షాకింగ్ నిర్ణయం.. దర్శక నిర్మాతలకు మరో ట్విస్ట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గత కొన్ని ఏళ్లుగా చక్రం తిప్పుతున్న కత్రినాకైఫ్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించినట్లు కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే కథనాలు ఎన్ని వెలువడుతున్నా కూడా ఇంతవరకు కత్రినా కైఫ్ ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం విక్కీ కౌషల్ కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి పనులకు సంబంధించిన ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్లోనే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లికి ముందు కత్రినాకైఫ్ తన తదుపరి సినిమా దర్శక నిర్మాతలకు ఒక ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 తెలుగులో కూడా..

తెలుగులో కూడా..

కత్రినా కైఫ్ మొదటి టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. వెంకటేష్ కె.విజయ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ గా నటించిన కత్రినా కైఫ్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. బాలకృష్ణతో కూడా అల్లరి పిడుగు అనే సినిమా చేసింది. కానీ అది అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ దక్కడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 స్టార్ హీరోతో ప్రేమలో..

స్టార్ హీరోతో ప్రేమలో..

సల్మాన్ ఖాన్ తో కూడా ఆమె ప్రేమలో ఉన్నట్లు గతంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఆమె అప్పట్లో సల్మాన్ ఖాన్ తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్లీ ఆ ఇద్దరూ ఎవరి జీవితాలను వారు ప్రత్యేకంగానే కొనసాగించారు. సినిమా ఆఫర్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రొఫెషనల్ గా మంచి నటిగా కలిసి నటించారు. ఏదేమైనా కూడా కత్రినా కైఫ్ వయసు పెరుగుతున్న కొద్దీ తన అందాన్ని పెంచుకోవడమే కాకుండా స్టార్ హోదాను కూడా పెంచుకుంటూ వస్తోంది.

 యువ హీరోతో పెళ్లికి రెడీ..

యువ హీరోతో పెళ్లికి రెడీ..

ఇక డిసెంబర్ నెలలో ఆమె విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలలైతే గత ఏడాదిలోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా అలాగే చేతిలో ఉన్న కమిట్మెంట్స్ వలన పెళ్లి చేసుకోవడానికి వారికి సరైన సమయం దొరకలేదు. ఇక మొత్తానికి యువ నటుడు విక్కీ కౌశల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో వెడ్డింగ్ కు సంబంధించిన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
పేరు మార్చుకుంటున్న కత్రినా..

పేరు మార్చుకుంటున్న కత్రినా..

అయితే పెళ్లికి ముందే కత్రినాకైఫ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఆమె పేరును పెళ్లికి ముందే మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాబోయే సినిమాల్లో కూడా కత్రినా కైఫ్ కాకుండా 'కత్రినా కౌషల్' అనేలా మరొక పేరు ఉండేలాగా దర్శక నిర్మాతలకు కూడా ముందుగానే సూచించిందట. కత్రినా ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాలో కూడా కౌషల్ పేరు వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X