పెళ్లిపై స్టార్ హీరోయిన్ మాట.. లవ్ ఫెయిల్యూర్, నాకు వర్కౌట్ కావడం లేదు!

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. నటన పరంగానే కాదు.. గ్లామర్, డాన్స్ పరంగా కూడా కత్రినా ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకే ఈ 35 ఏళ్ల హాట్ బ్యూటీ ఇంకా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. కత్రినా కైఫ్ బాలీవుడ్ కెరీర్ లో ఎన్నో లవ్ ఎఫర్స్ ఉన్నాయి. పెళ్ళికి సిద్ధం అనుకున్న తరుణంలో కూడా ఈ అమ్మడి ప్రేమ బ్రేకప్ అయింది. లవ్ బ్రేకప్ తరువాత కత్రినా కైఫ్ జీవితంలో చాలా మార్పులే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కత్రినా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఏడేళ్ల సహజీవనం

ఏడేళ్ల సహజీవనం

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కత్రినా కైఫ్ ఏడేళ్లపాటు సహజీవనం చేసింది. ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించేవారు. అప్పట్లో కొన్ని ఫోటోలు కూడా వీరిద్దరివి లీకై సంచలనం సృష్టించాయి. కత్రినా, రణబీర్ పెళ్లి పీటలెక్కడం ఖాయం అనుకున్న తరుణంలో వీరి ప్రేమ బ్రేకప్ అయింది. బాలీవుడ్ లో వీరిద్దరి బ్రేకప్ ఒక సంచలనం. 2016లో ఈ జంట విడిపోయారు. రణబీర్ కపూర్ ప్రస్తుతం అలియా బట్ తో ప్రేమలో మునిగితేలుతున్నాడు. కత్రినా మాత్రం సింగిల్ గానే మిగిలిపోయింది.

పెళ్లి చేసుకోవాలని ఉంది

పెళ్లి చేసుకోవాలని ఉంది

ఇటీవల కత్రినా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లిపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎందుకో నా లైఫ్ లో పెళ్లి అనే విషయం వర్కౌట్ కావడం లేదు. కానీ పెళ్లి కోసమే దిగులు పడకుండా ముందుకు సాగుతున్నా అంటూ కత్రినా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రణబీర్ కంటే ముందుగా కత్రినా, సల్మాన్ ఖాన్ మధ్య ఘాటు ప్రేమ వ్యవహారం జరిగింది. ఆ ప్రేమ కూడా సఫలం కాలేదు.

వేదాంతం మాట్లాడుతూ

వేదాంతం మాట్లాడుతూ

కొన్ని అనుభవాల దృష్ట్యా మన జీవితం మన చేతుల్లో లేదు అని అర్థం అయింది. మన తలరాతని రాసే అదృశ్య శక్తి ఎదో ఉంది. అందుకే నా పెళ్లి నిర్ణయాన్ని ఆ దేవుడికే వదిలేస్తున్నా. విధి ప్రకారం నా జీవితంలో పెళ్లి ఎప్పుడు నిర్ణయించి ఉంటె అప్పుడు జరుగుతుంది. అంతవరకు నా పని నేను చేసుకుంటూ వెళతా అంటూ కత్రినా కైఫ్ వేదాంతం మాట్లాడింది. ఇప్పటివరకు నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనలకు నేను భాధ్యురాలిని కాదు. భవిష్యత్తు కూడా నా చేతుల్లో లేదు అని కత్రినా చెప్పుకొచ్చింది.

కోరుకున్న ప్రేమ దొరుకుతుంది

కోరుకున్న ప్రేమ దొరుకుతుంది

ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. నా జీవితంలో నేను కోరుకున్న ప్రేమ ఎదురవుతుందని ఆశిస్తున్నా. అది వీలైనంత త్వరగా జరగాలని మాత్రం నేను కోరుకొవడం లేదు. ప్రేమ క్రమంగా పెరిగేది కాదు. ఒక్క క్షణంలో జరిగిపోతుంది అని కత్రినా తెలిపింది. సినిమాల విషయానికి వస్తే కత్రినా ఇటీవల థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంతో సందడి చేసింది. త్వరలో షారుఖ్ ఖాన్ సరసన నటించిన జీరో చిత్రం విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X