రూ. 200 కోట్ల పెళ్లి వేడుకలో కత్రినా కైఫ్ డాన్స్ పెర్ఫార్మెన్స్, వీడియో వైరల్!
కోట్లు ఖర్చుపెట్టే స్థోమత ఉండాలే కానీ సినిమా తారలతో కూడా మన పెళ్లి వేడుకల్లో డాన్సులు చేయించొచ్చు. తాజాగా ఉత్తరఖండ్ రాష్ట్రంలోని ఔలి అనే ప్రాంతంలో జరిగిన ఓ కోటీశ్వరుల కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ హాజరైన నృత్య ప్రదర్శన ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.
సౌతాఫ్రికా బేస్డ్ బిజినెస్‌మెన్ బ్రదర్స్ అజయ్, అతుల్ గుప్తా కుమారుల పెళ్లి వేడుకలో ఈ దృశ్యం కనిపించింది. వ్యాపారవేత్తలైన ఈ సోదరులు ఈ పెళ్లి వేడుకను రూ. 200 కోట్లు ఖర్చుతో అత్యంత విలాసవంతంగా నిర్వహించారట. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో డాన్స్ షో ఏర్పాటు చేయించారు.

కత్రినాకు ఎన్ని కోట్లు ఇచ్చారో?
కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్ పెళ్లి వేడుకలో డాన్స్ చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ప్రదర్శన ఇవ్వడం కోసం ఆమెకు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కత్రినాతో పాటు రాపర్ బాద్‌షా కూడా ఈ వేడుకలో సందడి చేశారు.

పెళ్లి వేడుకలో జోష్ నింపిన కత్రినా
గ్లిట్టరీ రెడ్ కాస్టూమ్, బ్లాక్ టైట్స్ అండ్ బూట్లు ధరించిన కత్రినా...పెళ్లి వేడుకలో మరింత జోష్ నింపారు. పలు బాలీవుడ్ హిట్ సాంగులకు డాన్స్ చేస్తూ పెళ్లి వేడుకకు హాజరైన అతిథులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ సంస్థ ద్వారా కత్రినాను సంప్రదించి
క్యాటలిస్ట్ ఎంటర్టెన్మెంట్స్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ద్వారా కత్రినాను సంప్రదించినట్లు తెలుస్తోంది. కత్రినా స్థాయికి తగిన విధంగా భారీ రెమ్యూనరేషన్‌తో ఆమె టీంకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి ఆమెను పెళ్లి వేడుకలో నృత్య ప్రదర్శనకు ఒప్పించారట.
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘భారత్' చిత్రం జూన్ 5 ఈద్ సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్లకుపైగా వసూలు చేయడంతో పాటు విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రంలో కత్రినా తనదైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











