గుండె పగిలే అంటూ కత్రినా కైఫ్ భావోద్వేగం.. ప్రధానికి విరాళం ఎంతంటే (వీడియో)
కరోనావైరస్ దేశాన్ని స్థంభించిన సమయంలో అందాల భామ కత్రినా కైఫ్ ఆర్థిక సహాయంతో స్పందించింది. PM CARES fundకు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతుగా విరాళాలను అందజేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు ప్రభుత్వాలకు అండగా నిలువాలని తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా కోరింది. తాను చేసిన విరాళం వివరాలను గోప్యంగా ఉంచారు.
ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తున్న సమయంలో ఎదురవుతున్న సవాళ్లు, గుండె పగిలే విధంగా ఉన్న బాధలను అధిగమించేందుకు ఈ తరుణంలో ప్రతీ ఒక్కరు స్పందించాలి అని తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో కత్రినా కైఫ్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండండి. ఇతరుల నుంచి వైరస్ సోకకుండా.. మీ నుంచి మరోకరికి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ ఒక్కరు జాగ్రత్తతో ఉండాలి అని కత్రినా వీడియోలో వెల్లడించింది.
ఇక కెరీర్ పరంగా సూర్యవంశీ అనే చిత్రంలో నటించింది. అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 24వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు.


Click it and Unblock the Notifications











