For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Katrina Kaif: కత్రినా కైఫ్ పెళ్లిలో పెద్ద గొడవ.. చెప్పులు, కుర్చీలు విసిరేసుకుంటూ రభస

  |

  బాలీవుడ్ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కత్రినా కైఫ్. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అక్షయ్ కుమార్ తీస్ మార్ ఖాన్ చిత్రంలోని షీలా కి జవానీ సాంగ్ తో ఎక్కడాలేని క్రేజ్ సంపాందించుకుంది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం సాగించిన కత్రీనా కైఫ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. అయితే తను వివాహ కార్యక్రమంలో మునిగిపోయి ఉంటే అక్కడ పెద్ద గొడవ అయిందట. తన పెళ్లిలో పెద్ద రభస చేశారని తాజాగా కత్రీనా కైఫ్ తెలిపింది.

  వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో..

  వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో..

  బాలీవుడ్ లో ముందుగా ఎవరు ఎదుర్కోలేనన్ని విమర్శలు ఎదుర్కొంది కత్రినా కైఫ్. కత్రినా కెరీర్ స్టార్టింగ్ లో ఆమె నటనపై చేయని డైరెక్టర్ లేడు. అసలు ఆమెకు డ్యాన్స్ వచ్చా.. నటన అంటే తెలుసా అని అనేక విమర్శలు ఎదుర్కొంది ఈ బ్యూటి. దీంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో ఆకట్టుకుంది. బికినీ వేసి తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది.

  గ్లామర్ చూపించడంలో నో లిమిట్స్..

  గ్లామర్ చూపించడంలో నో లిమిట్స్..

  మల్లీశ్వరీ సినిమా సక్సెస్ ఎలా ఉన్నా ఈ హాట్ భామ పేరు మాత్రం తెలుగు ఆడియెన్స్ నోళ్లలో నానింది. ఇందులో తన అందాలతో యూత్ ను ఆకట్టుకుంది. సినిమాలో మీర్జాపూర్ యువరాణిలా కనిపించిన కత్రినా కైఫ్ ను తమ క్వీన్ గా ఊహించుకుంది యువత. ఆ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు సినిమాలో ఆడిపాడింది. ఇందులో కూడా తన గ్లామర్ చూపించడంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు.

  షీలా కి జవానీ సాంగ్ తో..

  షీలా కి జవానీ సాంగ్ తో..

  అల్లరి పిడుగులో తను ఎంత గ్లామర్ ఒలకబోసిన సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. ఎటు చూసిన పరాజయమే కనిపిస్తోందని మళ్లీ తన గూటికే చేరింది. అక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కత్రినా కైఫ్ వెను తిరిగి చూసుకోలేదు. తనకు నటన, డ్యాన్స్ రాదని ఎవరైతే అన్నారో వాళ్లే ఆశ్చర్యపోయేలా చేసింది ఈ బ్యూటిఫుల్ కత్రినా కైఫ్. నటనలోనూ ఆకట్టుకున్న కత్రీనా కైఫ్.. షీలా కి జవానీ సాంగ్ తో తన డ్యాన్స్ మహిమేంటో చూపించింది.

  సల్మాన్ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం..

  సల్మాన్ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం..

  అగ్నిపథ్ లో చికినీ చమేలిగా, ధూమ్ 3లో కమిలి కమిలి అంటూ డ్యాన్స్ లో ఇరగదీసింది. కెరీర్ ను నిలదొక్కుకునే సమయంలోనే బాలీవుడ్‌లో పలువురు హీరోలతో లవ్‌ట్రాక్‌లు నడిపింది కత్రినా. సల్మాన్ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం గురించి తెలిసిందే. ఇక, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ఆమె ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వెళ్లింది. ఏమైందో ఏమో ఇద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేసుకున్నారు.

  రాజస్థాన్‌లో ఓ ఖరీదైన హోటల్లో..

  రాజస్థాన్‌లో ఓ ఖరీదైన హోటల్లో..

  రణ్ బీర్ కపూర్ తో ప్రేమాయణం విఫలం కావడంతో యంగ్ హీరో విక్కీ కౌశల్ తో మరోసారి లవ్ ట్రాక్ నడిపింది. కొన్నేళ్లు ఇద్దరు సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకుని వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఎలాంటి హడావుడీ లేకుండా విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది కత్రీనా. రాజస్థాన్‌లో ఓ ఖరీదైన హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దగా సెలబ్రిటీలను పిలవకుండా కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగిపోయింది.

  వెనుక నుంచి పెద్ద పెద్ద శబ్దాలు..

  వెనుక నుంచి పెద్ద పెద్ద శబ్దాలు..

  అయితే కత్రీనా-విక్కీ పెళ్లి జరిగే సమయంలో పెద్ద గొడవ జరిగిందట. ఈ విషయం గురించి తాజాగా బయట పెట్టింది ఈ బ్యూటి. ''పెళ్లి పీటలపై కూర్చుని అతిథులవైపు చూస్తున్నా. ఇంతలో అకస్మాత్తుగా నా వెనుక నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి. దీంతో ఏమైందా అని వెనక్కి తిరిగి చూశాను. అక్కడ నా చెల్లెల్లు, విక్కీ ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు. వారి గొడవ ఎలా ఉందంటే.. చివరికీ కుర్చీలు, చెప్పుల్ని ఒకరిపై మరొకరు విసురుకున్నారు.

  గొడవలో ఎవరు గెలిచారో..

  గొడవలో ఎవరు గెలిచారో..

  ఒకరినొకరు తిట్టుకున్నారు. కానీ అప్పుడు నేను ఆ గొడవ దగ్గరికి వెళ్లలేకపోయా. కానీ ఆ గొడవలో ఎవరు గెలిచారో అడగడం మాత్రం మరిచిపోయా'' అని చెప్పిన కత్రినా కైఫ్ నవ్వేసింది. ఇక పెళ్లి తర్వాత వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంది. అప్పుడప్పుడు రొమాంటిక్ ఫొటోలు పెడుతూ సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేస్తోంది. ఇక కత్రీనా కైఫ్ ఇటీవల నటించిన ఫోన్ భూత్ అంత పెద్ద సక్సెస్ కాలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో టైగర్ 3 సినిమా చేస్తోంది ఈ హాట్ బ్యూటి.

  English summary
  Bollywood Beauty Katrina Kaif Recall About Her Sister And Her Husband Vicky Kaushal Friends Fight In Her Wedding.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X