Katrina Kaif యువ హీరోతో రంజుగా సహజీవనం.. గుట్టు బయటపెట్టిన బాలీవుడ్ హీరో, డైరెక్టర్

బాలీవుడ్‌లో రూమర్లకు, గాసిప్స్‌కు ఏ మాత్రం కొదువ ఉండదనేది అందరికి తెలిసిందే. కత్రినా కైఫ్ డేటింగ్, అఫైర్ల విషయం ఎప్పడూ ట్రెండింగ్ టాపిక్‌గానే ఉంటుంది. గతంలో పలువురు యంగ్ హీరోలతో డేటింగ్, అఫైర్ బ్రేకప్స్ తర్వాత తాజాగా ఇటీవల కాలంలో దేశభక్తితో కూడి చిత్రాలతో ఆకట్టుకొంటున్న యువ హీరోతో సహజీవనం చేస్తున్నారనే విషయాన్ని అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

హాట్ హాట్‌గా ఓవియా హెలెన్.. వానలో తడిసిన అందాలతో ప్రియుడితో శృంగారం (ఫోటోలు)

గతంలో రణ్‌బీర్, సల్మాన్‌తో అఫైర్

గతంలో రణ్‌బీర్, సల్మాన్‌తో అఫైర్

గతంలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారం రంజుగా సాగింది. ఆ సమయంలో వారిద్దరు ప్రైవేట్ టూర్‌ కోసం విదేశాలకు వెళ్లడం... ఆ తర్వాత ఆ ఫోటోలు మీడియాలో లీక్ కావడంపై పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌తో కూడా అఫైర్ కొద్ది రోజులు సాగించింది. ఏవో కారణాలతో వారిద్దరు కూడా విడిపోయిన విషయం కూడా తెలిసిందే.

 ప్రస్తుతం వికీ కౌశల్‌తో

ప్రస్తుతం వికీ కౌశల్‌తో

ప్రస్తుతం వికీ కౌశల్‌తో అఫైర్ మరింత రంజుగా సాగుతున్న విషయం పలు సందర్భాల్లో మీడియా కెమెరాలకు చిక్కడంతో బయటపడింది. ఇటీవల కాలంలో తరుచూ కత్రినా కైఫ్ ఇంటి వద్ద వికీ కనిపించడం ఆ ఫోటోలు మీడియాలో లీక్ కావడంతో వారిద్దరి మధ్య రిలేషన్ కన్ఫర్మ్ అయింది.

కత్రినా ఇంటిలో వికీ కౌశల్ రొమాన్స్

కత్రినా ఇంటిలో వికీ కౌశల్ రొమాన్స్

కొద్ది రోజుల క్రితం వికీ కౌశల్, కత్రినా కైఫ్ ఒకే బిల్డింగ్‌లో కనిపించడం మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్ అయ్యాయి. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో కత్రినా ఇంటికి వెళ్లిన వికీ... రాత్రి 8.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. కత్రినా కైఫ్ ఇంటి నుంచి వికీ వెళ్లేటప్పడు ఆమె కారు డ్రైవర్ తమ కారును పక్కకు జరిపి దారి ఇవ్వడం కనిపించింది.

కత్రినా, వికీ కౌశల్‌కు ఒకే సమయంలో కరోనా

కత్రినా, వికీ కౌశల్‌కు ఒకే సమయంలో కరోనా

ఇక ఏప్రిల్ 5 తేదీన వికీ కౌశల్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఆ మరుసటి రోజే కత్రినాకు కూడా కరోనావైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వారిద్దరి క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందారు. ఏప్రిల్ 16 తేదీన వికీ కౌశల్‌కు కరోనావైరస్ నెగిటివ్ అని వస్తే.. ఏప్రిల్ 17వ తేదీన కత్రినా కైఫ్‌కు నెగిటివ్ అని తేలింది. ఈ విషయంపై బాలీవుడ్ మీడియాకు హీరో హర్ష వర్ధన్ కపూర్ క్లారిటీ ఇచ్చారు.

అవును వారిద్దరూ కలిసే ఉంటున్నారు

అవును వారిద్దరూ కలిసే ఉంటున్నారు

కత్రినా కైఫ్, వికీ కౌశల్ లివింగ్ రిలేషన్‌షిప్‌ను వెల్లడిస్తూ.. అవును వారిద్దరూ ఒకే ఇంటిలో కలిసి ఉంటున్నారు. అది నిజం. నేను చెప్పడం వల్ల ఇబ్బంది, సమస్యలు ఏమీ రావు అని విష్ణు వర్ధన్ అన్నారు. అలాగే అక్షయ్ కుమార్‌తో కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ చిత్ర ప్రమోషన్‌లో కరణ్ జోహర్ అసలు బయటపెట్టారు. కత్రినా ఇంటిలో కౌశల్ మంగళ్ హై అంటూ కామెంట్ చేశారు. దీంతో మరోసారి వారి సహజీవనం విషయం కన్ఫర్మ్ అయింది.

కత్రినా, వికీ, హర్ష్ వర్ధన్ కెరీర్స్

కత్రినా, వికీ, హర్ష్ వర్ధన్ కెరీర్స్

వికీ కౌశల్, కత్రినా కైఫ్, హర్షవర్ధన్ కపూర్ కెరీర్ విషయాలకు వస్తే... కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, ఫోన్ బూత్, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తున్నారు. వికీ కౌశల్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ, సర్దార్ ఉద్దమ్ సింగ్, అలాగే సామ్ మానిక్ షా బయోపిక్‌లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ కపూర్.. రే అనే అంథాలజీలో నటించారు. ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X