సల్మాన్, కత్రినా వీడియో వైరల్.. మొగుడు, పెళ్ళాంలాగే!
కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ సూపర్ హిట్ జోడి మరో మారు వెండి తెరపై మెరవబోతోంది. అలీ జాఫర్ దర్శకత్వం వహించే భారత్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించబోతున్నారు. ఇదిలా ఉండగా తాజగా వీరిద్దరూ మనీష్ మల్హోత్రా నిర్వహించిన ఫ్యాషన్ డిజైనర్ షోలో పాల్గొన్నారు. కత్రినా, సల్మాన్ జంట ఈ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఓ వీడియో నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తోంది.

సల్మాన్, కత్రినా సందడి
కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ డిజైనర్ షోలో ర్యాంప్ పై నడచి సందడి చేశారు. వీరి జంట చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ ఫొటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వీడియో వైరల్
ఈ ఈవెంట్ లో సల్మాన్, కత్రినాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ర్యాంప్ పై నడిచేందుకు తెర వెనుక సల్మాన్, కత్రినా సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కొంచెం తొందరపడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇంతలో కత్రినా కైఫ్ సల్మాన్ ని ఆపి, చేతిలో చేయి వేసి ముందుకు కదిలింది.

భార్య భర్తల్లా
ఈ దృశ్యం చూసిన అభిమానులు మాజీ లవర్స్ ఇద్దరూ భార్య భర్తల్లా మెలుగుతున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో సల్మాన్, కత్రినా ప్రేమ వ్యవహారం గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటికి ఈ కండల వీరుడు బ్రహ్మచారే.
Recommended Video


ప్రియాంక స్థానంలో
భారత్ చిత్రంలో అవకాశం కత్రినాకు అనుకోకుండా దక్కింది. మొదట ఈ చిత్రంలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ పీసీ తప్పుకోడవంతో కత్రినా ఎంటర్ అయింది.


Click it and Unblock the Notifications











