అతడిని అస్సలు నమ్మను, ఎఫైర్ వల్ల చాలా కష్టపడ్డా, ఇపుడు సుఖంగా ఉంది: కత్రినా
నేహా ధూపియా చాట్ షోలో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నుంచి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు మీకు కలిసి నటించిన యాక్టర్లలో సీక్రెట్స్ విషయంలో ఎవరిని అస్సలు నమ్మరు? అనే ప్రశ్నకు కత్రినా నిర్మొహమాటంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ పేరు చెప్పింది.
డాన్స్ విషయంలో మీతో సరిపోలని సహ నటుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ 'నేనైతే అందరూ అని చెబుతాను' అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె 'ఫితూర్' మూవీలో ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి చేసిన పష్మినా సాంగ్ గుర్తు చేసుకున్నారు. 'నాకు ఆది అంటే ఇష్టమే.. కానీ అతుడు ఆ సాంగ్ చేస్తున్నపుడు చాలా కష్టంగా ఫీలైనట్లు అనిపించింది. అది చాలా డిఫికల్ట్ సాంగ్, ఈ జీగా చేయడానికి నేను చెప్పేని సలహాలు పట్టించుకోలేదు' అన్నారు.

అందుకే చాలా కష్టపడ్డాడు
నేను అతడికి అడ్వైజ్ ఇవ్వడానికి ప్రయత్నించినపుడు అతడు తీసుకోవడానికి ఇష్టపడలేదు. కొన్ని డాన్స్ మూమెంట్స్ కష్టంగా ఉన్నపుడు ఇతరులు ఇచ్చే సలహా తీసుకోవాలి, కానీ అతడు నేను చెప్పేది వినక పోవడంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని కత్రినా తెలిపారు.

ఆ పరిస్థితులు నన్ను మార్చాయి
సాధారణంగా కత్రినా కైఫ్ తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడదు. కానీ తన మాజీ లవర్ రణబీర్ కపూర్‌తో రిలేషన్‌షిప్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. అప్పుడు ఎదుర్కొన్న భయానక పరిస్థితులు తనను ఇంకా బెటర్‌గా ఎలా మార్చాయో చెప్పే ప్రయత్నం చేశారు.

ఇపుడు చాలా సుఖంగా ఉంది
రణబీర్ కపూర్‌తో రిలేషన్ సమయంలో ఊహించని అనుభవాలు ఎదుర్కొన్నాను. ఆ రిలేషన్ నుంచి బయటకు రావడమే మంచిది అని డిసైడ్ అయ్యాను. అందులో నుంచి బయటకు వచ్చే క్రమంలో జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు, ఇపుడు చాలా సుఖంగా ఉన్నట్లు కత్రినా తెలిపారు.

కత్రినా కైఫ్
కత్రినా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘భారత్' అనే చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈద్ సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న సూర్య వంశీ అనే చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











