బ్రేకప్ మర్చిపోవడానికి అదొక్కటే దారి.. ఆ బాధ అలవాటైపోయింది: కత్రినా కైఫ్
సినిమా ఇండస్ట్రీలో సినీ తారల మధ్య ప్రేమలు చిగురించడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. ఇక అందులో సక్సెస్ అయ్యేవి కొన్నే. కాలం మారుతున్న కొద్దీ డేటింగ్ కపుల్స్ ఎక్కువవుతున్నారు గాని ఆ ప్రేమను చాలా మంది పెళ్లి పీటల వరకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ తన ప్రేమకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. బ్రేకప్ గురించి కూడా వివరణ ఇచ్చింది.

టాలీవుడ్ మల్లీశ్వరి..
కత్రినా కైఫ్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. అమ్మడు వెండితెరకు పరిచయమైంది తెలుగు సినిమాతోనే. వెంకటేష్ మల్లీశ్వరి సినిమాలో గ్లామర్ షోను ప్రజెంట్ చేసి మంచి క్రేజ్ అందుకుంది. తెలుగులో ఆఫర్స్ పెరుగుతున్నాయి అనుకున్న సమయంలో అమ్మడు బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ అవకాశాలు రాగానే ఇటువైపు చూడటం మానేసింది. జయపజయలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లోనే అమ్మడు తన క్రేజ్ ని పెంచుకుంది.

సల్మాన్ తో ప్రేమాయణం..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఎప్పుడైతే సినిమా చేసిందో అప్పటి నుంచి కత్రినా క్రేజ్ అమాంతంగా పెరిగింది. 2005లో వీరిద్దరు మొదటిసారి 'మైనే ప్యార్ క్యోం కియా' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వరుసగా సినిమాలు చేశారు. స్క్రీన్ పై వారి కెమిస్ట్రీ సక్సెస్ కావడంతో సల్మాన్ ఆమె ప్రేమలో పడటానికి ఎంతో సమయం పట్టలేదు. కానీ ఆ లవ్ ఎక్కువ కాలం నిలవలేదు.

బ్రేకల్ గోల..
సల్మాన్ ఖాన్ మొత్తానికి ఒక హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వస్తున్న సమయంలో బ్రేకప్ గోల మొదలైంది. ఫైనల్ గా రూమర్స్ నిజమయ్యాయి. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్లు చెప్పకనే చెప్పేశారు. గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ ఇద్దరు కలుస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అవేమి నిజం కాదని తేలిపోయింది.

కత్రినా కామెంట్స్..
కత్రినా కైఫ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో ఆమెకు ఎక్కువగా సల్మాన్ ఖాన్ సపోర్ట్ చేశాడు. దర్శక నిర్మాతలు కత్రినా వద్దని చెప్పినా కూడా కొన్ని సినిమాల్లో ఆమెకు అవకాశాలు ఇప్పించాడు. అదే విషయాన్ని చెబుతూ కత్రినా కాస్త ఎమోషన్ అయ్యింది. సల్మాన్ పక్కన ఉంటే చాలా దైర్యం ఉంటుందని పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తన పక్కన ఉన్న వాళ్లకు సపోర్ట్ చేస్తాడని తెలిపింది.
Recommended Video

ప్రేమను మర్చిపోవడానికి..
'నా పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. ఇక సల్మాన్ తో దూరం పెరిగినా కూడా ఒక మంచి స్నేహితుడిలా ఉంటున్నాడు. బ్రేకప్స్ అనేవి సహజంగా మారిపోయాయి. ఆ జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఎక్కువగా బుక్స్ చదువుతున్నాను. బాధ నుంచి కొలుకోవాలంటే అదొక్కటే దారి' అంటూ కత్రినా కైఫ్ వివరణ ఇచ్చింది. ఇక గత కొంత కాలంగా ఈ బ్యూటీ మరో కుర్ర హీరో విక్కీ కౌశల్ తో లవ్ లో ఉన్నట్లు రూమర్స్ వస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











