twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోను లాగి చెంప దెబ్బ కొట్టిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?

    |

    అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన సూర్యవంశీ చిత్రం థియేటర్లలో రిలీజై మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. గత రెండేళ్లుగా బాలీవుడ్‌లో ఏ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాలేదనే విషయం తెలిసింది. వాస్తవానికి సూర్యవంశీ చిత్రం 2020లో రిలీజ్ కావాల్సింది. అయితే కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా, అలాగే మహారాష్ట్రలో రికార్డు స్థాయి కేసులో నమోదు కావడంతో రెండేళ్లుగా కర్ఫ్యూలు, లాక్‌డౌన్లతో రాష్ట్రం దిగ్బంధమైన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో పరిస్థితి అదుపులోకి రావడంతో థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ కత్రినా కైఫ్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.

     Katrina Kaif slapped Akshay Kumar in Sooryavanshi

    సూర్యవంశీ చిత్ర ప్రమోషనల్‌లో భాగంగా ఇటీవల అత్యంత టీఆర్పీ ఉన్న ది కపిల్ శర్మ షోలో అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్ పాల్గొన్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తే.. ఆయనకు భార్య కత్రినా కైఫ్ నటించింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవగన్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.

    సూర్యవంశీ చిత్రంలో అక్షయ్ కుమార్‌ను చెంపపై కొట్టిన విషయాన్ని కత్రినా కైఫ్ మీడియాకు వెల్లడించింది. ఓ సీన్‌లో అక్షయ్‌ను చెంపపై కొట్టాలి. ఆ సీన్‌లో సింగిల్ టేక్‌లో ఓకే అయింది. ఆ సీన్ రీటేక్ లేకుండానే ఓకే అయింది. ఒకే షాట్‌లో డైరెక్టర్ ఓకే చెప్పడం గమనార్హం.

    అయితే చెంప దెబ్బ సీన్‌పై అక్షయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. కత్రినా కైఫ్ నన్ను నిజంగానే కొట్టింది. ఆ సీన్‌లో రీటేక్ తీసుకోలేదు. చెంప దెబ్బ కొట్టేటప్పుడు మా మధ్య దూరం లేదు. దాంతో నిజంగానే గట్టిగా దెబ్బ తగిలింది. అయితే రొమాంటిక్ సీన్లలో మాత్రం చాలా రీటేక్స్ తీసుకొన్నాం అని అక్షయ్ కుమార్ తెలిపారు.

    అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. గతంలో హమ్‌ ఖో దీవానా కర్ గయే, నమస్తే లండన్, సింగ్ ఈజ్ కింగ్, వెల్‌కమ్, దే ధనా ధన్, తీస్ మార్‌ ఖాన్ చిత్రాల్లో నటించారు.

    English summary
    Bollywood Star Heroine Katrina Kaif slapped Akshay Kumar in Sooryavanshi. Katrina Kaif said that I was hit Akshay Kumar in a scene without any retake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X