For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పక్కా ప్లాన్ తోనే కత్రినాకైఫ్, విక్కీ కౌషల్ వివాహం.. గెస్టులకు కఠినమైన కండిషన్.. ఎందుకంటే?

    |

    బాలీవుడ్ సినిమా ప్రపంచంలో పెళ్లికి సిద్ధంగా ఉన్న జంటల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది అనే చెప్పాలి. ఇటీవల కాలంలో కొంత మంది హీరో హీరోయిన్స్ వారి ప్రేమ జీవితానికి సంబంధించిన విషయాలను చాలా ఓపెన్ గానే చెప్పేసారు. అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మరికొందరు క్లారిటీ ఇచ్చేశారు. అయితే వారిలో మరికొందరు మాత్రం చాలా రహస్యంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కత్రినా కైఫ్ అలాగే హ్యాండ్సమ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా పెళ్లికి వచ్చే గెస్టులకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

    డేటింగ్ నుంచి పెళ్లి వరకు

    డేటింగ్ నుంచి పెళ్లి వరకు

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా అగ్ర హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న కత్రినాకైఫ్ త్వరలోనే బ్యాచిలర్ జీవితానికి ముగింపు కార్డు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో రెగ్యులర్ గా కథనాలు వెలువడుతున్నాయి. ఇక వీరి ప్రేమ జీవితం పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రస్తుతం అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

    చాలా గోప్యంగా జరగాలని

    చాలా గోప్యంగా జరగాలని

    పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను హీరో విక్కీ కౌశల్ ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. కత్రినాకైఫ్ కుటుంబ సభ్యులు కూడా అతనితో కలిసి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహం చాలా గోప్యంగా జరగాలని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కు ప్రత్యేకంగా హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. కత్రినా కైఫ్ తో పాటు విక్కీ కౌశల్ కూడా పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఇక పెళ్లి కూడా అదే తరహాలో జరగాలి అని అనుకుంటున్నారు.

    పెళ్లి వేదిక ఫిక్స్

    పెళ్లి వేదిక ఫిక్స్

    కత్రినా కైఫ్ విక్కీ కౌషల్ వివాహ వేడుకలు డిసెంబర్ 7-12 వరకు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్‌లో బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం, విక్కీ మరియు కత్రినా వివాహ వేదిక వద్ద అతిథులకు నో మొబైల్ పాలసీని ఫాలో అయ్యే విధంగా నిర్ణయించుకున్నారు.

    నో మొబైల్ పాలసీ

    నో మొబైల్ పాలసీ

    పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చే సమయంలోనే కత్రినాకైఫ్ విక్కీ గెస్టులకు ప్రత్యేకంగా నో మొబైల్ పాలసీ గురించి చెప్పారట. ఎవరు కూడా మొబైల్ తో ఫొటోలు తీసుకురాకుండా మేనేజ్మెంట్ సభ్యులు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పెద్దగా విఐపిలు కాకుండా కేవలం అతి దగ్గర కుటుంబ సభ్యులు అలాగే పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం.

    Masakali 2.0 Review | Why Bollywood Spoiling AR Rahman Songs? | Frustrated Fan Review
    వారి తరహాలోనే విక్కీ పెళ్లి

    వారి తరహాలోనే విక్కీ పెళ్లి

    తమకి తెలియకుండా ఎలాంటి ఫోటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలోకి రాకుండా చూసుకోవాలని ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్టార్స్ ఇద్దరూ కోరారు. గతంలో నో-మొబైల్ విధానాన్ని ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ మరియు దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ వంటి జంటల వివాహాల సమయంలో కూడా అమలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు కత్రినా విక్కీల పెళ్లి కూడా అదే తరహాలో గోప్యంగా జరగనుందట.

    English summary
    Katrina kaif vicky kaushal marriage latest update no Mobile policy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X