VickTrina: వైభవంగా జరిగిన కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. ఫొటోలు లీక్.. స్పెషల్ విషెస్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ కు సంబంధించిన పెళ్లి వార్తలు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాది అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక మొత్తానికి గురువారం రోజు ఈ పెళ్లి జంట ఏడడుగులు వేసి సరి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ల పుకార్లకు ఈరోజు పెళ్లి వేడుకతో సరైన సమాధానం ఇచ్చారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

అలా మెయింటైన్ చేశారు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కత్రినా కైఫ్ గత కొంతకాలంగా యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారి కూడా వీరి ప్రేమ విషయం పై ఎవరు అధికారికంగా వివరణ అయితే ఇవ్వలేదు. కానీ చాలా సార్లు జంటగా కనిపించడంతో తప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ అయితే వచ్చేసింది.

గ్రాండ్ గా రాయల్ వెడ్డింగ్
ఇక మొత్తానికి విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాజస్థాన్ లోని ఒక ప్రత్యేకమైన రాయల్ హోటల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మాధోపూర్ జిల్లాలోని ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహం జరగనున్నట్లు ముందుగానే క్లారిటీ వచ్చేసింది. ఇక సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌లో గ్రాండ్ రాయల్ వెడ్డింగ్ కోసం అన్ని ఏర్పాట్లను కొన్ని రోజుల ముందే ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్టార్ సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి వేడుకలో కె మీడియా ప్రతినిధులు ఎవరికి కూడా గమనించలేదు.

పూర్తయిన పెళ్లి వేడుక
వీరి పెళ్లి వేడుకకు చాలా సెక్యూరిటీ నడుమ జరిగింది. ఫోటోలు బయటకు లీక్ అవ్వకూడదు అని ముందుగానే ఆంక్షలు విధించారు.. అంతేకాకుండా మొబైల్ ఫోన్లు ఎవరు కూడా తీసుకు రాకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం విక్కీ కౌశల్ హిందూ సాంప్రదాయ ప్రకారం కత్రినా కైఫ్ మెడలో మూడుముళ్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులతో పాటు పలువురు సినీ తారలు కూడా పాల్గొన్నట్లు సమాచారం.

ఫొటోలు లీక్
పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ఇద్దరు కూడా చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. మీ జంట చాలా అద్భుతంగా ఉంది అని నెటిజన్లతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికీ అదే ఆనందంతో కొనసాగాలి అంటూ పెళ్లి రోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Recommended Video

పెళ్లికి కూడా బిజినెస్ డీల్స్..?
ఇక వీరి పెళ్లి కోసం ఒక ఓటీటీ సంస్థ వంద కోట్లకుపైగా ఆఫర్ చేసినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లికి సంబంధించిన ఫోటోలను వీడియోల ఫుటేజ్ హక్కులను పూర్తిగా సొంతం చేసుకునే ఒక డాక్యుమెంటరీ తరహాలో విడుదల చేయాలని అనుకున్నాడట అందుకోసం ఓటీటీ కంపెనీ 100 కోట్లకుపైగా ఆఫర్ చేసినట్లు టాక్ అయితే వచ్చింది మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. గతంలో కూడా చాలా మంది సినీ తారలు ఇదే తరహాలో వారి పెళ్లి వేడుకలను బిజినెస్ గా వాడుకుని భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకున్నారు.


Click it and Unblock the Notifications











