twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాహ్నవి కపూర్ పొట్టి దుస్తులు వేయడంపై... కత్రినా కామెంట్, నోరు మూయించిన సోనమ్!

    |

    అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె కూతురు జాహ్నవి కపూర్... గతేడాది 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జాహ్నవి గ్లామర్ డోసు పెంచుతూ ముందుకు సాగుతోంది. ఎప్పుడు బయటకు వెళ్లినా సెక్సీ లుక్‌తో దర్శనమిస్తూ అందరి మతి పోగొడుతుంది.

    ముఖ్యంగా జిమ్‌కు వెళ్లే సమయంలో జాహ్నవి పొట్టిగా ఉండే షార్ట్స్ ధరించి తన అందంతో అల్లాడిస్తుంది. జిమ్ బయట వెయిట్ చేస్తున్న ఫోటో గ్రాఫర్లకు హాట్ హాట్ ఫోజులు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. జాహ్నవి కపూర్ తీరుపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరో హీరోయిన్ కత్రినా కైఫ్ రియాక్ట్ అయ్యారు.

    మరీ అంత చిన్న షార్ట్స్ వేయడం మంచిది కాదు

    మరీ అంత చిన్న షార్ట్స్ వేయడం మంచిది కాదు

    నేహా ధూపియా నిర్వహించే ఓ టాక్ షోలో కత్రినా మాట్లాడుతూ...‘‘ నేనూ, జాహ్నవి కపూర్ ఒకే జిమ్‌కు వెళతాం. కలిసి వర్కౌట్లు చేస్తాం. కానీ ఆమె వేసే పొట్టి పొట్టి షార్ట్స్ చూసినపుడు నాకు ఆందోళన కలుగుతుంది. అలాంటి దుస్తుల్లో రావడం మంచిది కాదు'' అని వ్యాఖ్యానించారు.

    తప్పుడు సంకేతాలు

    తప్పుడు సంకేతాలు

    జిమ్‌కు వచ్చేపుడు చాలా ఓవర్‌ లుక్‌తో వచ్చే సెలబ్రిటీ ఎవరు? అనే ప్రశ్నకు స్పందిస్తూ కత్రినా కైఫ్ పై విధంగా స్పందించారు. అలాంటి దుస్తుల్లో రావడం వల్ల ఫోటో గ్రాఫర్లు వివిధ యాంగిల్స్ ఫోటోలు తీస్తారు, సోషల్ మీడియాలో వాటిపై రకరకాల ప్రచారం జరుగుతుంది, అందుకే నేను వర్రీ అవుతున్నాను... అని కత్రినా వ్యాఖ్యానించారు.

    నా చెల్లినే అంటావా? కత్రినా నోరు మూయించిన సోనమ్

    తన చెల్లిపై కత్రినా ఇలాంటి కామెంట్స్ చేయడం... సోనమ్ కపూర్‌కు అస్సలు నచ్చలేదు. ‘జాన్వి రెగ్యులర్‌ దుస్తులు కూడా వేసుకుంటుంది. రాకింగ్ లుక్‌తో అదరగొడుతుంది' అంటూ జాహ్నవి వైట్ టాప్, జీన్స్ షార్ట్ వేసిన ఫోటో షేర్ చేసింది. ఇలా చేయడం ద్వారా కత్రినా నోరు మూయించే ప్రయత్నం చేసింది.

    జాహ్నవి కపూర్

    జాహ్నవి కపూర్

    జాహ్నవి కపూర్ సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎర్‌ఫోర్స్ ఫైలెట్‌గా కనిపించబోతున్నారు. దీంతో పాటు కరణ్ జోహార్ తెరకెక్కించబోయే తక్త్ మూవీకి కమిటైంది.

    English summary
    Katrina Kaif worriers about Jhanvi Kapoor's short dresses. At the chat show with Neha Dhupia, Katrina Kaif was quizzed about, “Which celebrity goes OTT in his/her gym, and workout looks?” and to this, this Bharat actress took Jhanvi Kapoor’s name. Kat said, “Not OTT, but I am concerned about the very, very short shorts that Jhanvi wears!''
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X