ఓ వైపు సినిమా సక్సెస్: పాపం ఆమె జైల్లో, కన్నీరు పెట్టిన తండ్రి.... పుట్టినరోజున ఎంత కష్టం?
సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం 'కేదార్‌నాథ్'. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషించిన ఈ ప్రేమకథా చిత్రం డిసెంబర్ 7న విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంటే నిర్మాత ప్రేర్నా అరోరా జైల్లో ఉండటం చిత్ర యూనిట్లో ఆనందం లేకుండా చేసింది. వివాదాలు, లీగల్ కేసులు ప్రేర్నా అరోరాకు కొత్త కాక పోయినా సంతోష సమయంలో ఇలాంటి పరిస్థితి దాపురించడం దురదృష్టం కాకపోతే మరేమిటని అంతా చర్చించుకుంటున్నారు.

ఎందుకు అరెస్టయిందంటే?
‘కేదార్‌నాథ్' సినిమా హక్కులకు సంబంధించిన వివాదంలో ముంబై ఎకనమిక్ అఫెన్స్ వింగ్ అధికారులు ప్రేర్నా అరోరాను శనివారం అరెస్టు చేశారు. తమకు ఇవ్వాల్సిన ఈ చిత్ర హక్కులను చట్ట విరుద్ధంగా రోనీ స్క్రూవాలాకు అప్పగించారని, దీని వల్ల తామకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆరోపిస్తూ మరో నిర్మాత వశు భగ్నానీ, పూజా ఎంటర్టెన్మెంట్స్ సంస్థలు.. క్రిఅర్జ్ ఎంటర్టెన్మెంట్స్ అధినేతగా ఉన్న ప్రేర్నా అరోరాపై కేసు పెట్టారు.

పుట్టినరోజున జైల్లోనే...
వారి ఫిర్యాదు మేరకు శనివారం ప్రేర్నా అరోరాను అరెస్ట్ చేశారు. అదే రోజు ఆమె పుట్టినరోజు కూడా. దీంతో స్పెషల్ డే రోజు జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం కోర్టులో వెల్లడిస్తూ ప్రేర్నా తండ్రి వీరేంద్ర అరోరా కన్నీటి పర్యంతం అయ్యారు.

తనపై వస్తున్న ఆరోపణలు తప్పు అంటున్న ప్రేర్నా
ఎకనమిక్ అఫెన్స్ వింగ్ అధికారుల అరెస్టు నేపథ్యంలో ప్రేర్నా అరోరా నుంచి స్టేట్మెంట్ ఒకటి విడుదలైంది. వశు భగన్నాని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, చట్టబద్దంగానే తాను కేదార్‌నాథ్ హక్కులను రోనీ స్క్రూవాలాకు కట్టబెట్టడం జరిగిందని తెలిపారు. చట్టం మీద, అధికారుల మీద తనకు నమ్మకం ఉందన్నారు.

కేదార్‌నాథ్ బాక్సాఫీస్
శుక్రవారం విడుదలైన ‘కేదార్‌నాథ్' 2.0 చిత్రానికి గట్టి పోటీ ఇస్తోంది. ఈ చిత్రం శుక్రవారం రూ. 7.25 కోట్లు వసూలు చేయగా.. శనివారం రూ. 9.75 కోట్లు రాబట్టింది. దీంతో తొలి రెండు రోజుల కలెక్షన్ రూ. 17 కోట్లకు చేరువైంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











