‘కేదార్‌నాథ్’ ట్రైలర్: ఓ వైపు ప్రకృతి బీభత్సం, మరో వైపు ప్రేమ పోరాటం!
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'కేదార్‌నాథ్'. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తుండగా అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 7న సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్ క్షేత్రాన్ని 2013లో ముంచెత్తిన భారీ వరదల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం కేదార్‌నాథ్ క్షేత్రం చుట్టూ జరిగే కథాంశంతో నడుస్తుందని తెలుస్తోంది.
హిందూ మతానికి చెందిన యువతి పాత్రలో సారా అలీ ఖాన్. కేదార్‌నాథ్‌లో యాత్రికులను తీసుకెళ్లే గైడ్ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించారు. అయితే వీరి ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డు చెప్పడంతో ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి? వరదలకు, వీరి ప్రేమ కథకు లింకేమిటి? అనేది సినిమా తర్వాతి కథ.
2013 నాటి కేదార్‌నాథ్ వరదలను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ట్రైలర్లో అద్భుతంగా ఉన్నాయి. సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. సారా పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.

ఈ చిత్రంపై కొన్ని సన్నివేశాలపై హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.


Click it and Unblock the Notifications











