ముద్దులతో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు.. ప్రకృతితో పోరాటం!
Recommended Video

బాలీవుడ్ లో క్రమంగా నట వారసులు పెరుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది నటులు, నటీమణులు వారసత్వంలో బాలీవుడ్ ని ఏలుతున్నారు. తాజాగా మరో నటి బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ తన డెబ్యూ మూవీ కేదర్‌నాథ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే సారా అలీఖాన్ తన అందంతో ఆకట్టుకుంది. ఇక నటన పరంగా ఎలా మెప్పిస్తుందనే సందేశం ఉండేది. తాజాగా కేదర్ నాథ్ చిత్ర టీజర్ విడుదలయింది.

ఆసక్తికరమైన ప్రేక కథ
సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సారా అలీఖాన్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. సారా అలీఖాన్ ధనవంతురాలైన యువతి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేదర్‌నాథ్ లో సామాన్లు మోసే కూలీగా పనిచేస్తుంటాడు. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అనుకోకుండా ఈ జంట వరదలో చిక్కుకుంటుంది. హీరోయిన్ ని కాపాడేందుకు సుశాంత్ ప్రకృతితో పోరాడుతుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనే ఉత్కంఠ భరితమైన కథాంశంతో దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ముద్దు సీన్లు
ఎమోషనల్ ప్రేమ కథకు తగ్గట్లుగా ఈ చిత్రంలో సారా అలీఖాన్ ముద్దు సన్నివేశంలో నటించింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎమోషనల్ గా అద్భుతమైన హావభావాలు పలికించింది. టీజర్ లోని విజువల్స్, బ్యాగ్రౌండ్ సంగీతం అద్భుతంగా ఉన్నాయి.
కెమిస్ట్రీ అదుర్స్
సుశాంత్ సింగ్, సారా అలీఖాన్ మధ్య కెమిస్టీ చూడముచ్చటగా ఉంది. ఉత్కంఠ భరితమైన ఈ ప్రేక కథ యువతని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది. వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లు పెద్ద స్టార్లుగా మారారు. ఇటీవలే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సారా అలీఖాన్ ఏమేరకు సత్తా చాటుతుందో చూడాలి.

విడుదల ఎప్పుడంటే
డిసెంబర్ 7న ఈ చిత్ర విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. భక్తి, ప్రేమ రెండు కలగలిపిన ఈ చిత్రం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది. 2013 లో పుణ్యక్షేత్రమైన కేదర్‌నాథ్ ని భారీ వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











