twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనాలి బింద్రే, టబు ఎలా తప్పించుకున్నారు? సల్మాన్ కి మాత్రమే శిక్ష, అసలు సంగతి ఇదే!

    |

    Recommended Video

    Why Salman Khan Only Convicted..? Karma Gets You In The End..!

    సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో గురువారం రోజు జోధ్ పూర్ న్యాయ స్థానం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల పాటు న్యాయ స్థానం శిక్ష విధించింది. కానీ సల్మాన్ తో పాటు మరో నలుగురు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారు.

    సీనియర్ హీరోయిన్లు టబు, సోనాలి బింద్రే, సార్ హీరో సైఫ్ అలీఖాన్, మరో వ్యక్తి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇంత మంది నిందితులు ఉండగా కేవలం సల్మాన్ ఖాన్ కు మాత్రమే ఎందుకు శిక్ష ఎందుకు పడింది? మిగిలినవారు ఎలా నిర్దోషులుగా తప్పించుకున్నారు అనే సందేహం సగటు అభిమానుల్లో కలుగుతోంది.

     అసలేం జరిగింది

    అసలేం జరిగింది

    సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే మరియు టబు ఓ చిత్ర షూటింగ్ కొరకు 1998 లో రాజస్థాన్ వెళ్లారు. అక్కడ అటవీ ప్రాంతంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలని వేటాడుతుండగామిగిలిన వారంతా ప్రోత్సహించారనే అభియోగాలు ఉన్నాయి.

     కేసు నమోదు చేసిన బిష్ణోయ్ లు

    కేసు నమోదు చేసిన బిష్ణోయ్ లు

    వృక్షాలని, అటవీ జంతువులని ప్రాణ ప్రదంగా చూసుకునే బిష్ణోయ్ లు ఇలాంటి చర్యలని అసలు సహించరు. దీనితో సల్మాన్ ఖాన్ పై కేసు నమోదు చేసిన గత 20 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు.

    శిక్ష ఖరారు చేసిన కోర్టు

    శిక్ష ఖరారు చేసిన కోర్టు

    20 ఏళ్లుగా కొనసాగుతున్న కేసులు జోధ్ పూర్ న్యాయస్థానం ఎట్టకేలకు ముగింపు పలికింది. సల్మాన్ ఖాన్ ని మాత్రమే దోషిగా నిర్దారిస్తూ మిగిలినవారిని నిర్దోషులుగా ప్రకటించింది.

    సోనాలి బింద్రే, టబు ఎలా తప్పించుకున్నారు

    సోనాలి బింద్రే, టబు ఎలా తప్పించుకున్నారు

    ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న బిష్ణోయ్ లు సల్మాన్ ఖాన్ వేటాడుతుండగా గమనించనట్లు తెలుస్తోంది. కానీ ఆ ప్రత్యక్ష సాక్షులు కోర్టులో సోనాలి బింద్రే, టబు ని గుర్తించడంలో విఫలం అయినట్లు తెలుస్తోంది. వారికి వ్యతిరేకంగా మరే అధరాలు లేకపోవడంతో న్యాయమూర్తి సల్మాన్ మినహా మిగిలివారందరిని నిర్దోషులుగా ప్రకటించారు.

    150 మీటర్ల దూరం

    150 మీటర్ల దూరం

    కృష్ణ జింకలని వేటాడే సమయంలో అక్కడ ఉన్న నటుల్ని గుర్తించవలసిందిగా న్యాయస్థానం ప్రత్యక్ష సాక్షిని అడిగింది. కానీ వారు వారిని గుర్తించడంలో విఫలం అయ్యారు. ఆ సమయాల్లో వారు ప్రయాణిస్తున్న వాహనం 150 మీ దూరంలో ఉందని తెలిపాడు.ఆసమయంలో వారు భిన్నమైన వేషధారణలో కనిపించారని అందువలనే తాను ఇప్పుడు గుర్తించలేకపోతున్నాని కోర్టుకు వివరించాడు.

    English summary
    Why Salman Khan only Convicted. Key witness didn't identify Tabu, Sonali in court
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X