ఆఫర్ రావాలంటే.. పడక సుఖం అందించాల్సిందే.. క్యాస్టింగ్ కౌచ్‌పై కేజీఎఫ్ బ్యూటీ
Raveena Tandon:సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టిస్తోంది. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు.. వెండి తెర నుంచి బుల్లితెర వరకు ఎన్నో మంది భామలు కాస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు తెలుస్తోంది. తొలినాళ్లలో అవకాశాల పేరుతో తమని అలా వేధించారని ఓపెన్ అవుతున్నారు. ఇండస్ట్రీలో అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని పలువురు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ.. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ హాట్ బ్యూటీనే రవీనాటాండన్ (Raveena Tandon).
క్యాస్టింగ్ కౌచ్ పై రవీనా కామెంట్స్..
వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే టాలీవుడ్ ,కోలీవుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా చాలా మంది హీరోయిన్స్.. తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి బయటకు చెప్పుకుంటున్నారు. అవకాశాల కోసం వారి కోరికలను తీర్చాలని డిమాండ్ చేసేవారని చాలామంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి తమ ఇబ్బందులు చెప్పుకొచ్చారు. ఇక అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ ఒకరు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బరిన పడ్డానని సంచలన కామెంట్లు చేశారు.

నో చెప్పితే అంతే..
సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా.. ఎంత మాట్లాడినా చాలా తక్కువే అంటారు రవీనా టాండన్. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే.. వాళ్లతో పడక సుఖం అందించాలని షాకింగ్ కామెంట్ చేసింది ఈ హాట్ బ్యూటీ. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఫేమ్ సంపాదించుకున్న వారు కూడా కాస్టింగ్ కౌచ్ వంటి చేదు అనుభవాలను ఫేస్ చేసిన వారేనని, తాను కూడా పలుమార్లు ఆ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఓపెన్‌గానే చెప్పేసింది.
కాస్టింగ్ కౌచ్ ఆడవాళ్ల పాలిట శాపం
సినీ ఫీల్డ్ లో ప్రతి డిపార్ట్ మెంట్ లో కాస్టింగ్ కౌచ్ అనే భూతం ఆడవాళ్ల పాలిట శాపంలా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా.. సినీ బ్యాక్ డ్రాప్ ఉన్నావారికి, బడా ఫ్యామిలీ వారికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తమ మాట వినని నటులను తొక్కి పారేస్తారని కామెంట్స్ చేసింది. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ పై పొగరు అనే ముద్ర వేస్తారని, వారి బిహేవియర్ బాగా లేదంటూ క్యారెక్టర్ ను దెబ్బతీస్తారని చెప్పుకొచ్చింది. అలాగే.. తన కెరీర్ ను కూడా నాశనం చేయాలని చాలా మంది ప్రయత్నించారనీ, చాలామంది పలు కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కుట్ర వెనుక ఓ పెద్ద కారణమే ఉందని చెప్పుకొచ్చింది రవీనా టాండన్.

నాపై కక్ష సాధింపు
కొంత మంది తనపై కక్ష సాధించారనీ, వారి బెడ్ రూమ్ వరకు వెళ్లలేదని, వారి కోరికలను తీర్చలేదని తనపై కసితో బురద చల్లే ప్రయత్నాలు చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది. బడా బాబులు తమ పడక సుఖం కోసమే హీరోయిన్ల జీవితాలను నాశనం చేసేవారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారనని, ఇండస్ట్రీలో చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ బరినా పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది రవీనా. అప్పట్లో సుశాంత్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఇండస్ట్రీలో నెపోటిజంతో పాటు కాస్టింగ్ కౌచ్ కారణంగా చాలా మంది టాలెంట్ ఆర్టిస్టులు సరైన అవకాశాలను పొందలేకపోతున్నారని రవీనా సంచలన వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











