ఏ క్షణంలోనైనా సూసైడ్ చేసుకొంటా.. హీరోయిన్‌కు టార్చర్.. ముంబై పోలీసులకు ఫిర్యాదు

భోజ్‌పురి సినిమా పరిశ్రమలో అగ్రనటి, ఖత్రోంకే కిలాడి ఫేమ్ రాణి ఛటర్జి‌కి చేదు అనుభవం ఎదురైంది. తనపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన వేధింపుల వల్ల తాను డిప్రెషన్‌కు గురవుతున్నానని, ఆ టార్చర్‌తో అర్ధరాత్రి అఘాయిత్యం చేసుకోవాలనిపిస్తున్నది. కాబట్టి మీరే నన్ను కాపాడాలి అంటూ ముంబై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. నటికి ఎదురైన వేధింపుల గురించి పూర్తి వివరాల్లోకి వెళితే...

అసభ్యంగా, అశ్లీలంగా చేష్టలు

అసభ్యంగా, అశ్లీలంగా చేష్టలు

హీరోయిన్ రాణి చటర్జీ తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సభ్యుడైన ధనుంజయ్ సింగ్ అనే వ్యక్తి నన్ను కొద్దిరోజులుగా వేధిస్తున్నారు. అసభ్యకరమైన మాటలు, అశ్లీలకరమైన పద్దతిలో రాతలు రాస్తూ నన్ను వేధిస్తున్నాడు. మాటల్లో చెప్పలేని విధంగా అవమానిస్తున్నారు. నన్ను ముసలిదానా అంటూ తిడుతున్నాడు అని రాణి ఛటర్జీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

డిప్రెషన్‌కు గురయ్యాను

డిప్రెషన్‌కు గురయ్యాను

ధనుంజయ్ వేధింపులను పట్టించుకోవద్దని ప్రారంభంలో అనుకొన్నాను. కానీ ఆయన పెట్టే పోస్టులు, కామెంట్లను కొందరు నాకు షేర్ చేస్తున్నారు. దాంతో నాకు ఇబ్బందిగా మారింది. ఆ వేధింపుల కారణంగా డిప్రెషన్‌కు గురి అవుతున్నాను. ఏ సమయంలో నేను ఏం చేసుకొంటానో తెలియడం లేదు. నా మానసిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. నాకు ఏమైనా జరిగితే అందుకు కారణం ధనుంజయ్ సింగ్ మాత్రమే అని రాణి ఛటర్జీ ఫిర్యాదులో తెలిపారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే

ధనుంజయ్ సింగ్ అనే వ్యక్తి వేధింపుల కారణంగా నా వ్యక్తిగత జీవితం సమస్యల్లో కూరుకుపోతున్నది. నా వ్యక్తిగత ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లుతున్నది. రోజు రోజుకు మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన స్పందన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఏం తోచడం లేదు అని రాణి ఛటర్జీ పేర్కొన్నారు.

ఆత్మహత్యే శరణ్యమనే

ఆత్మహత్యే శరణ్యమనే

నాపై వేధింపులకు పాల్పడిన వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. అయితే వారు నీ పేరు ఉపయోగించడం లేదు కదా అని అన్నారు. కానీ ఆ వ్యక్తి నన్ను టార్గెట్ చేసుకొనే పోస్టులు పెడుతున్నాడు. ఆయన వేధింపులను ఇక భరించలేను. ఇక ఇలాంటి వేధింపులు ఆగకపోతే ఆత్మహత్య చేసుకోవడమే చివరి ప్రయత్నంగా అనిపిస్తున్నది. ధనుంజయ్ నాపై పెడుతున్న పోస్టులు, వివరాలను పొందుపరుస్తున్నాను అని రాణి ఛటర్జీ అన్నారు.

Recommended Video

Rajavaru Ranigaru Movie Team Success Celebrations
డిసెంబర్‌లో పెళ్లికి ప్లాన్స్

డిసెంబర్‌లో పెళ్లికి ప్లాన్స్

ఇక రాణి ఛటర్జీ వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రస్తుతం టెలివిజన్ యాక్టర్‌తో డేటింగ్ చేస్తున్నది. డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ కూడా చేసుకొన్నారు. అంతా సవ్యంగా సాగితే డిసెంబర్‌లో పెళ్లి కూడా జరుగుతుంది. పెళ్లికి సన్నాహాలు చేసుకొంటన్న సమయంలో ఇలాంటి వేధింపులకు గురికావడం ఆమె మానసిక ఆందోళనకు కారణమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X