నాపై కర్య్ఫూ.. మానాన్న ప్రవర్తనతో షాకయ్యాను: శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కామెంట్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాహ్నవి కపూర్ సోదరి ఖుషీ కపూర్ తన తండ్రి, నిర్మాత బోనీ కపూర్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు ఆయన నా విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు, నాపై కర్ఫ్యూ విధించినట్లు ఉంటుందని చెప్పుకొచ్చారు.

దివంగత నటి శ్రీదేవి చిన్నకూతురైన ఖుషీ కపూర్ ఇటీవల నేహా ధూపియా షో బిఎఫ్ఎఫ్ వోగ్ సీజన్ 3కి హాజరైన సందర్భంగా తన తండ్రి గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నేహా ధూపియా ఖుషీ కపూర్ నుంచి చాలా విషయాలు రాబట్టారు.

ఆయన్ను గుడ్డిగా నమ్మేస్తా

ఆయన్ను గుడ్డిగా నమ్మేస్తా

తన సోదరి జాహ్నవి కపూర్ మాదిరిగానే ఖుషీ కపూర్ కూడా నటన వైపు అడుగులు వేయాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఎవరి దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వాలని కోరిగా ఉందనని ప్రశ్నించగా ‘కరణ్ జోషహార్‌ను నేను గుడ్డిగా నమ్మేస్తాను, కానీ నా కోస్టార్ ఎవరు అనేది మా నాన్న నిర్ణయిస్తారు' అని తెలిపారు.

మా నాన్న కర్ఫ్యూ విధించాడు

మా నాన్న కర్ఫ్యూ విధించాడు

ఖుషీ.. ఇప్పుడు నీకు 18 సంవత్సరాలు, ఈ వయసులో నీకు ఇబ్బంది కలిగించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా.... ‘మా నాన్న వల్ల కొన్ని సార్లు ఇబ్బంది అనిపిస్తుంది. మాపై ఏదో కర్ఫ్యూ ఉన్నట్లు ప్రవర్తిస్తాడు, కొన్ని సార్లు అతి జాగ్రత్తగా అనిపిస్తుంది' అని ఖుషీ చెప్పుకొచ్చారు.

నాన్న.. మా స్నేహితులకు అలా మెసేజ్ పెట్టడంతో షాకయ్యాను

నాన్న.. మా స్నేహితులకు అలా మెసేజ్ పెట్టడంతో షాకయ్యాను

నేను ఎక్కడ ఉన్నాను? ఎవరితో ఉన్నాను? అనే విషయాలు తెలుసుకోవడానికి ఓసారి నా ఫ్రెండ్ ఒకరికి ఆయన మెసేజ్ పెట్టారు. అంతే కాదు ‘బేటా.. ఖుషితో కలిసి ఓ ఫోటో దిగి పంపు' అని కోరిన విషయం నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. ఆయన అలా ప్రవర్తించడంతో షాకయ్యాను అని ఖుషీ చెప్పుకొచ్చారు.

అమెరికా వెళ్లబోతున్న ఖుషి

అమెరికా వెళ్లబోతున్న ఖుషి

త్వరలో ఖుషి కపూర్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందేందుకు అమెరికా వెళ్లబోతోంది. అక్కడ శిక్షణ పొంది తిరిగి వచ్చి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కరణ్ జోహార్ మూవీ ద్వారా ఆమె లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X