శ్రీదేవి చిన్న కూతురు బాలీవుడ్ ఎంట్రీ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్
సీనియర్ హీరోల కొడుకులు వెండితెరకు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే సీనియర్ హీరోయిన్స్ కూతుళ్ళు ఎవరైనా బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తే కూడా బజ్ అదే రేంజ్ లో ఉంటుంది. ఇక సీనియర్ నటి శ్రీదేవి కుతుళ్ళపై కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు అదే రేంజ్ లో ఉండేవి. మొదటి కూతురు జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆమె తమిళ్ తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా కూడా కేవలం బాలీవుడ్ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ధడక్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోవడంతో జాన్వీ కెరీర్ పై మొదట్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక ఆమె చెల్లి ఖుషి కపూర్ కెరీర్ అలా మొదలవ్వకూడదని వారి తండ్రి బోణి కపూర్ చాలానే ఆలోచిస్తున్నారు. ఆమెను కూడా కరణ్ జోహార్ చేతుల్లోనే పెడతారని తెలుస్తోంది.

ఇక గత ఎడాది నుంచి ఖుషి కపూర్ ఎంట్రీకి సంబంధించిన రూమర్స్ చాలానే వస్తున్నాయి. అయితే ఇక వచ్చే ఏడాది తప్పకుండా ఆమె ఎంట్రీ ఉంటుందని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఖుషి కపూర్ అమెరికాలో యాక్టింగ్ పై ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరో ఆరు నెలలు యూఎస్ లోనే ఉంటుందట. కోర్సు పూర్తయిన తరువాత ఖుషి మొదటి సినిమాపై కరణ్ జోహార్, బోణి కపూర్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఖుషి మొదటి సినిమాతో ఎంతవరకు బాక్సాఫీస్ హిట్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











