శ్రీదేవి చిన్న కూతురు కూడా ఇపుడు అదే దారిలో....
శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసింది. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. భవిష్యత్తులో ఆమె తన తల్లి పేరును నిలబెట్టే స్థాయికి వెళుతుందనే ప్రశంసలు సైతం అందుకుంది.
త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్‌గా పరిచయం కాబోతోందట. వాస్తవానికి మొదట ఖుషి కపూర్ మోడల్ అవ్వాలనుకుంది. అయితే ఇపుడు తన మనసు మర్చుకుని నటన వైపు రావాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని బోనీ కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

'ధడక్' సినిమా ద్వారా నటిగా తెరంగ్రేటం చేసిన జాహ్నవికి మంచి గుర్తింపు, ఫేమ్ రావడంతో.... ఖుషి నిర్ణయం మార్చుకుందట. తన కూతుర్లు వారి ఇష్టమైన రంగాల్లో వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, నేను నా కుమార్తెలను తండ్రిగా కాకుండా ఓ స్నేహితుడిలా పెంచాను. నేనూ వారి వయసును దాటి వచ్చినవాడినే అని బోనీ కపూర్ తెలిపారు.
ప్రస్తుతం ఖుషీ కపూర్ వయసు 17 సంవత్సరాలు. గ్యాజ్యువేషన్ పూర్తయిన వెంటనే నటనలో శిక్షణ తీసుకోబోతోందని సమాచారం. అయితే ఖుషీ తెరంగ్రేటానికి ఇంకా చాలా సమయం పడుతుందని టాక్. మొత్తానికి భవిష్యత్తులో అక్కా చెల్లెళ్ల మధ్య పోటీ ఉంటుందనేది ఖాయం.


Click it and Unblock the Notifications











