Don't Miss!
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రీదేవి చిన్న కుమార్తె నిర్ణయం.. నాన్న ఏడ్చేశారు, నేను బాధపడ్డా.. జాన్వీ కపూర్!
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ తమ కెరీర్ లని చక్క దిద్దుకునే పనిలో ఉన్నారు. జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఖుషి కపూర్ కు మోడలింగ్ పై ఆసక్తి ఉందంటూ ప్రచారం జరిగింది. ఆమెకు నటి కావాలనే కోరిక కూడా ఉందట. కానీ మోడలింగ్ రంగానికి ఎంచుకోవాలా లేక నటిగా బాలీవుడ్ లో ప్రవేశించాలా అనే విషయంలో ఖుషి కపూర్ ఓ నిర్ణయానికి రాలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జాన్వీ కపూర్ తన ఖుషి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అమెరికా వెళ్లేందుకు నిర్ణయం
అనిత ష్రాఫ్ తో జరిగిన ఓ సంభాషణలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఇటీవల ఖుషి కపూర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిపింది. మోడలింగ్, సినిమా ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలనే విషయంలో ఖుషి కపూర్ చాలా రోజులుగా ఆలోచనలో ఉంది. ఖుషి ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఖుషి కపూర్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో సినిమా రంగం గురించి శిక్షణ పొందేందుకు అమెరికా వెళ్లబోతోంది. తిరిగొచ్చి సినిమా రంగంలో ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టాలనే నిర్ణయం తీకోనుంది అని జాన్వీ తెలిపింది.
నాన్న ఏడ్చారు
ఖుషి తీసుకున్న నిర్ణయం పట్ల తాను, తన తండ్రి బోనికపూర్ కాస్త ఆందోళన చెందినట్లు జాన్వీ తెలిపింది. కెరీర్ కోసం సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. కానీ నాన్న మమ్మల్ని విడిచి ఉండలేరు. ఖుషి కపూర్ తాను యూఎస్ వెళుతున్నట్లు చెప్పగానే నాకు బాధగా అనిపించింది. నాన్న అయితే ఒక్క క్షణం ఆలోచింది ఏడవటం ప్రారంభించారు అని జాన్వీ కపూర్ తెలిపింది.
ప్రతి రోజూ గొడవే
కేవలం ఒక్క విషయంలో మాత్రం తాను, ఖుషి ప్రతి రోజూ గొడవపడుతూనే ఉంటాం అని జాన్వీ తెలిపింది. ఇంట్లో నాకు, తనకు వేరువేరుగా బట్టలు లేవు. ఉన్న బట్టలనే ఏది నచ్చితే అది తీసుకుంటాం. ఇద్దరికీ ఒకే డ్రెస్ కావాలనుకున్న ప్రతి సారీ ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. ఖుషికి సంబంధించిన కొన్ని వస్తువులని కూడా ఆమెకు చెప్పకుండా వాడేస్తుంటా. నీకు మ్యానర్స్ లేదా అని తిడుతూ ఉంటుంది. ఇది మాఇద్దరి మధ్య ఎప్పుడూ ఉండేదే అంటూ జాన్వీ కపూర్ సరదాగా వ్యాఖ్యానించింది.
అమ్మ నా గురించి అలా
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవిని కూడా గుర్తు చేసుకుంది. తనకు హీరోయిన్ కావాలనే కోరిక ఉందని మొదట అమ్మతో చెప్పా. ఆ విషయంలో మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఓ సందర్భంలో నాకు అమ్మకు వాగ్వాదం జరిగింది. నేను ఏడవటం ప్రారంభించా. అమ్మ నన్ను ఓదార్చడానికి వచ్చి ఓ విషయం చెప్పింది. నువ్వు ఏడుస్తుంటే చాలా బావుంటవు. నటికి ఇది చాలా అవసరం అని చెప్పింది అంటూ జాన్వీ తన తల్లితో గడిపిన సంఘటనని గుర్తు చేసుకుంది.