పెళ్లయినా వదలకుండా... స్టార్ క్రికెటర్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఇండియాలో క్రికెటర్లకు, సినీ తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనదేశంలో ఎవ్వరికీ లేని ఫాలోయింగ్ వీరి సొంతం. నటులను, క్రికెటర్లను జనం తమ ఇంటిలో మనుషుల్లాగా, తమలో ఒకరిగా భావించడానికి మించి దేవుళ్ల మాదిరిగా పూజిస్తారు. ఈ క్రమంలోనే ఎంతోమంది క్రికెటర్లతో హీరోయిన్లు ఎఫైర్లు నడపటంతో పాటు పెళ్లి వరకు వెళ్లారు. పలువురి ప్రేమాయణాలు మధ్యలోనే ముగిసిపోయాయి. కానీ క్రికెటర్లు, హీరోయిన్ల రిలేషన్స్‌కి సంబంధించి నిత్యం ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ. ఈ వివరాల్లోకి వెళితే..
ఎంటీవీ ప్రోగ్రామ్స్‌తో పాపులర్
బెంగాలీ కుటుంబానికి చెందిన ఖుషి ముఖర్జీ కెనడాలో పుట్టి పెరిగారు. కెనడాతో పాటు ముంబైలో చదువుకున్న ఈ ముద్దుగుమ్మ దుబాయ్‌లోనూ నివసిస్తున్నారు. ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా సీజన్ 10, కహత్ హనుమాన్ జై శ్రీరామ్, బాల్‌వీర్ రిటర్న్స్, ఎంటీవీ లవ్ స్కూల్ సీజన్ 3తో ఖుషి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో హిందీ చిత్రం శ్రింగార్‌తో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇతియర్ధ అనే కన్నడ చిత్రంలోనూ దొంగ ప్రేమ, హార్ట్ అటాక్ అనే తెలుగు సినిమాల్లోనూ నటించింది. రితి రివాజ్ లవ్ ఫెస్టివల్, గాండు, ఫాదర్‌హుడ్ వెబ్‌సిరీస్‌లలోనూ మెరిసింది.

బోల్డ్ కంటెంట్ అమ్ముకుంటూ
సినిమాలు, నటన కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ ఖుషి కపూర్ ఫేమస్ అయ్యారు. బోల్డ్‌గా కనిపించడంతో పాటు తన బోల్డ్ కంటెంట్‌ను సైతం అమ్ముకుంటూ నెలకు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తూ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫ్యాన్ బేస్ కారణంగా ఖుషి పెట్టే పోస్టులకు భారీ ఆదాయాన్ని అందుకుంటున్నారు. అయితే స్పెషల్ కంటెంట్ కావాలనుకునేవారికి 390 రూపాయల సబ్‌స్క్రిప్షన్ ఫీజు పెట్టి కలకలం రేపింది. ఇక్కడితో ఆగలేదు.. పర్సనల్‌గా ఓ యాప్‌ను తీసుకొచ్చిన ఖుషి ముఖర్జీ.. ఇది ఓపెన్ చేసి స్పెషల్ కంటెంట్ కావాలంటే డబ్బులు చెల్లించాలి.. ఫోటోలు, వీడియోలకు సెపరేట్‌గా రేటు కట్టింది.
కోట్లు సంపాదిస్తోన్న ఖుషి ముఖర్జి
ఈమె పనులు చూసి జనాలు ముందు నవ్వుకున్నా... ఖుషి సంపాదనకు నోరెళ్లబెట్టారు. స్పెషల్ కంటెంట్, సబ్‌స్క్రిప్షన్ ఫీజు ద్వారా మూడేళ్లలో ఖుషి దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారట. అంతేకాదు.. ఫారిన్‌కు చెందిన ఓ ఫాలోవర్ ఈ కంటెంట్ కోసం అక్షరాల కోటి 13 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. దీనిని బట్టి ఆమె ఫాలోయింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో పాటు బ్రాండ్ అండార్సింగ్, స్పెషల్ ఈవెంట్స్, మాల్స్ ఓపెనింగ్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో భారీగా ఆర్జిస్తోంది. అలా నటీనటులు తమ చేతిలో సినిమాలు లేకపోయినా ఎలా సంపాదించవచ్చో చెబుతోంది.
సూర్య మెసేజ్‌లు చేసేవాడు
ఇదిలాఉండగా.. బోల్డ్ కామెంట్స్‌కు కేరాఫ్‌గా నిలిచే ఖుషి ముఖర్జీ ఈసారి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఖుషిని మీరు ఎవరైనా క్రికెటర్‌తో డేటింగ్ చేయాలని అనుకుంటున్నారా? అని అడగ్గా.. తనకు అలాంటి ఉద్దేశం లేదని కుండబద్ధలు కొట్టింది. ఎంతోమంది స్టార్ క్రికెటర్లు తనను ఫాలో అవుతారని.. ఇక సూర్యకుమార్ అయితే గతంలో తరచుగా మెసేజ్‌లు చేసేవాడని ఆరోపించింది. ప్రస్తుతం ఖుషి ముఖర్జీ వ్యాఖ్యలు బాలీవుడ్, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
దేవీషాతో ప్రేమ, పెళ్లి
కాగా.. సూర్యకుమార్ యాదవ్ తన కాలేజీ రోజుల్లోనే దేవీషాతో ప్రేమలో పడి సుదీర్ఘ కాలం డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో 2016లో ఆమెను పెళ్లాడారు. జీవితంలో ఎన్నో కఠినమైన పరిస్ధితులు ఎదురైనప్పుడు తనకు తన భార్య అండగా నిలిచిందని పలుమార్లు దేవీషా గురించి చెప్పాడు సూర్య. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. తనకు తీరిక దొరికినప్పుడల్లా భార్యను తీసుకుని దేశంలోని యాత్ర స్థలాలను సందర్శిస్తారు సూర్య. అలాంటిది ఖుషి ముఖర్జీ చెబుతున్న దాని ప్రకారం పెళ్లయిన తర్వాత కూడా సూర్య ఆమెకు మెసేజ్‌లు పెట్టాడనే అనుకోవాలి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











