నాలో అదే చూస్తారు.. అది మాత్రమే చూపించాలనుకుంటే కష్టం.. కియారా అద్వానీ
బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో కూడా హాట్ బ్యూటీ కియారా అద్వానీ జోష్‌ను కొనసాగిస్తున్నది. కబీర్‌సింగ్, గుడ్ న్యూస్ లాంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో సత్తా చాటింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో గిల్టీ అనే సిరీస్‌లో నటించింది. గిల్టీ వెబ్ సిరీస్ ప్రసారం కానున్న నేపత్యంలో కియారా, ఆ మూవీ దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ..

గిల్టీ వెబ్ సిరీస్‌లో
గిల్టీలో నేను డిఫరెంట్ క్యారెక్టర్‌ను పోషించాను. నా కెరీర్ ఆరంభంలో రొటీన్ పాత్రలతో నెట్టుకొచ్చాను. ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపించడం బాధగా ఉండేది. అలా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాను. ఎలాంటి సినిమాలు వస్తే అలాంటి అంగీకరించాను. కానీ ప్రేక్షకులు నన్ను ఆదరించిన తీరుతో ఆనందం కలిగింది అని కియారా అన్నారు.

కబీర్ సింగ్‌లో నన్ను ప్రీతీగా
కబీర్ సింగ్‌లో కియారా అనే విషయాన్ని వదిలేసి ప్రీతిగా మాత్రమే గుర్తుంచుకొన్నారు. అలాగే గుడ్ న్యూస్‌లో మోనికాగానే నన్ను ఆదరించారు. ఆ పాత్రల అంత బలంగా ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఇక ముందు నన్ను విభిన్నమైన నటిగా మాత్రమే చూస్తారు. నా నుంచి మంచి పాత్రలను కోరుకొంటారనే విషయం అర్ధమైంది అని కియారా పేర్కొన్నారు.

ప్రేక్షకుల అభిరుచి మారుతున్నది
సినిమాల విషయంలో ఈ తరం ప్రేక్షకుల అభిరుచి మారుతున్నది. అశ్లీలం, లైంగిక సంబంధిత, హింసాత్మక కంటెంట్ ఏదైనా సరే.. వాళ్లకు ఏది కావాలో అదే చూస్తారు. ప్రేక్షకులపై రుద్దాలని చూస్తే అది సాధ్యంకాదు. ప్రేక్షకుడు నిర్ణయం తీసుకొన్నాడనే దానిని మార్చడం కూడా కష్టమే అని కియారా అభిప్రాయపడ్డారు.
Recommended Video


ఏం కావాలో వారికి తెలుసు
ఒకవేళ ప్రేక్షకులు ఏదైనా చూడాలనుకొంటే.. దానికి కట్టుబడి ఉంటారు. కాబట్టి వాళ్లకు ఎలాంటి సినిమాలు కావాలో.. వాళ్లు ఏది ఆశిస్తున్నారనే విషయాన్ని పట్టించుకోవాలి. దర్శకుడు వాళ్లకు నచ్చిన సినిమాలు కాకుండా ప్రేక్షకులు ఏం కోరుకొంటున్నారో తెలుసుకోవాలి అని కియారా చెప్పారు.


Click it and Unblock the Notifications











