»   » ‘లస్ట్’ సీన్‌పై రియాక్ట్ అయిన కియారా అద్వానీ

‘లస్ట్’ సీన్‌పై రియాక్ట్ అయిన కియారా అద్వానీ

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  వైరల్ అవుతున్న భరత్ అను నేను హీరోయిన్ లస్ట్ వీడియో....!

  'భరత్ అనే నేను' హీరోయిన్ బ్యూటీ కియారా అద్వానీ పేరు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణం ఆమె నటించిన 'లస్ట్ స్టోరీస్' అనే హిందీ మూవీలోని ఓ సీన్ లీక్ అవ్వడమే! భర్త వల్ల సెక్స్ లైఫ్‌లో సరైన తృప్తి పొందని ఒక సాధారణ మధ్యతరగతి మహిళ పాత్రలో కియారా నటించారు. సెక్స్ టాయ్స్ ఉపయోగించి స్వయంతృప్తి పొందే సీన్లలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు సాంప్రదాయ ప్రేక్షకుల నుండి విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు.

  ఆ సీన్ చేసేపుడు ఎలాంటి ఇబ్బంది పడలేదన్న కియారా

  ఆ సీన్ చేసేపుడు ఎలాంటి ఇబ్బంది పడలేదన్న కియారా

  ఇలాంటి సీన్ చేసేపుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అనే ప్రశ్నకు కియారా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఈ సీన్ చేసేటపుడు ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడలేదు, కరణ్ జోహార్‌తో కలిసి పని చేయాలనేది నా డ్రీమ్, స్క్రిప్టు కూడా వినకుండా ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకున్నాను, ఆయన ఎలా చెబితే అలా చేశాను అని కియారా తెలిపారు.

  లస్ట్ స్టోరీస్

  లస్ట్ స్టోరీస్ అనేది ఒక ఆంథాలజీ(సంపుటి) చిత్రం. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ మాదిరిగానే ఇది ఓ రకమైన సినిమా. ఈ చిత్రానికి జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. 120 నిమిషాల నిడివిగల ఈ సినిమాలో ఈ నలుగురు డైరెక్టర్లు ఒక్కో పార్ట్‌కు డైరెక్షన్ చేశారు.

  లస్ట్ సీన్ కాపీ కొట్టి తీశారా?

  దర్శకుడు కరణ్ జోహార్ ఈ సీన్ ‘ది అగ్లీ ట్రూత్' అనే అమెరికన్ సినిమా నుండి కాపీ కొట్టి తీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దాన్ని ఇండియన్ నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది.

   ఒక్క సీన్‌తో కియారా హైలెట్

  ఒక్క సీన్‌తో కియారా హైలెట్


  ‘లస్ట్ స్టోరీస్' మూవీలో కియారా అద్వానీ, రాధిక ఆప్టే, భూమి ఫడ్నేకర్, మనీషా కొయిరాలా, విక్కీ కౌశల్, నేయిల్ భూపాలమ్, నేహా ధూపియా, సంజయ్ కపూర్, ఆకాష్ తోసర్ లాంటి ప్రముఖులు నటించారు. అయితే అందరికంటే హైలెట్ అయింది మాత్రం కియారా అని చెప్పక తప్పదు. ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. లస్ట్ సీన్ ఎఫెక్టుతో వచ్చిన పాపులారిటీతో కియారాకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

  English summary
  For the past few days, Kiara Advani has been the talk of the town, thanks to a scene in Lust Stories, an anthology film which was recently aired on Netflix. When Kiara was asked if she had any inhibitions while doing a particular sequence where she climaxes in front of the whole family, the actress said, “Absolutely not! Once in the moment, I just went for it. I trusted Karan Johar completely. I would have said yes to him even without listening to the script. It is a dream come true to work with him.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more