అర్ధరాత్రి కరణ్ జోహర్ ఫోన్ చేసి.. ఆ మాటతో షాకయ్యా.. భయమేసింది కూడా.. కియారా అద్వాని
ఎంఎస్ ధోని, భరత్ అనే నేను సినిమాల తర్వాత కియారా అద్వాని లస్ట్ స్టోరీస్ అనే మూవీ చేయడంతో ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అడల్డ్ కంటెంట్‌తో సినిమా చేయడమేంది అని ఆ సినిమా గురించి ఆరా తీశారు. నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే ప్రసారమైన వెబ్ సిరీస్ మూవీతో కియారా పాపులర్ అయ్యారు. ఆ సినిమాతో కియారాకు మరిన్ని అవకాశాలు పెరిగాయి. ఆ ఘటన గురించి చెబుతూ..

నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ రోజు అర్ధరాత్రి నాకు ఫోన్ చేశాడు. అంత రాత్రి నాకు ఫోన్ రావడం ఏమిటని అనుకొంటూనే నేను ఎత్తాను. ఏదైనా పార్టీ కోసం పిలువడానికి కాల్ చేశాడనుకొన్నాను. కరణ్ మాట్లాడుతూ.. నేను లస్ట్ స్టోరీస్ అనే సినిమా చేస్తున్నాను అని చెప్పగానే.. నాకు ఆఫర్ ఇస్తున్నారా అని అడిగాను. వెంటనే కరణ్ అవును అని సమాధానం ఇచ్చారు.

లస్ట్ స్టోరీస్ సినిమా గురించి
బాంబే వెల్వెట్ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు లస్ట్ స్టోరీస్ సినిమా అనగానే నాకు ఎన్నో రకాల ఆలోచనలు వచ్చాయి. అలా ఆలోచించుకొంటునే వెళ్లి ఆడిషన్ హాజరయ్యాను. కరణ్ జోహర్ సినిమా ఎలా ఉంటుందో అనే చాలా ఆలోచించాను.

నాకు అలా భయమేసింది..
మరుసటి రోజు ఉదయమే కరణ్ జోహార్ ఆఫీస్‌లో ఆడిషన్‌కు వెళ్లాను. ఆడిషన్‌కు ముందు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పారు. కానీ ఆ సన్నివేశాల గురించి విన్నప్పుడు నాకు భయమేసింది. నా తండ్రి కూడా చాలా ఆలోచించాడు. ఆ తర్వాత నాకు ఆ సినిమా మంచి పేరు తెచ్చింది. ప్రేక్షకులు కూడా నా నటనకు ఫిదా అయ్యారు.

లస్ట్ స్టోరీస్‌తో మరింత పాపులారిటీ
లస్ట్ స్టోరీస్ సినిమాతో మరింత పాపులారిటీ పెరిగింది. నాకు అవకాశాలు రావడం భారీగా మొదలయ్యాయి. ఆ సినిమాతోనే నాలోని ప్రతిభ బయటకు వచ్చింది. మొదట భయపడినా నేను లస్ట్ స్టోరీస్ మూవీ నాకు మేలు చేసింది. నెట్‌ఫ్లిక్స్ కోసం లస్ట్ స్టోరిస్ మూవీ కరణ్ జోహర్ రూపొందించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











