»   » సెక్స్, స్వయం తృప్తి గురించి కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు!

సెక్స్, స్వయం తృప్తి గురించి కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  పెళ్లికి ముందు సెక్స్ చేయడం నా దృష్టిలో అసలు తప్పే కాదు : కైరా అద్వానీ

  'లస్ట్ స్టోరీస్' మూవీలో నటించిన కియారా అద్వానీ స్వయంతృప్తి సీన్లతో హాట్ టాపిక్ అయింది. ఇలాంటి సీన్లలో నటించడంపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై కియారా స్పందిస్తూ వీటిని ప్రజలు అంగీకరించడానికి కొంత సమయం పడుతుందని అభిప్రాయ పడ్డారు. స్వయంతృప్తి అనేది సాధారణమైన విషయమే అయినా మన సమాజంలో బయటకు చెప్పుకోవడానికి, వాటిని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు అని కియారా అన్నారు. పెళ్లికి ముందు సెక్స్ కూడా తన దృష్టిలో తప్పు కాదని కియారా అభిప్రాయ పడ్డారు, సెక్స్ అనేది ప్రేమను వ్యక్తపరిచే ప్రక్రియగా చెప్పుకొచ్చారు.

  ఇలాంటివి అంగీకరించడానికి సమయం పడుతుంది

  ఇలాంటివి అంగీకరించడానికి సమయం పడుతుంది

  ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లు చేయడాన్ని బూతద్దంలో పెట్టి చూసేవారు. కానీ ఇపుడు ఇలాంటి సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. ప్రేక్షకులు కూడా వాటిని అంగీకరిస్తున్నారు. అదే విధంగా స్వయంతృప్తి సీన్లను అంగీకరించడానికి సమయ పడుతుంది అని కియారా అద్వానీ అన్నారు.

   పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు

  పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు

  ఒకప్పుడు పెళ్లికి ముందు సెక్స్ తప్పు అనే అభిప్రాయం నాలో ఉండేది. అయితే ఇపుడు నా అభిప్రాయం మారింది. సెక్స్ అనేది ప్రేమను వ్యక్తపరిచే ప్రక్రియ. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం అనేది వ్యక్తిగతం, ఇందులో తప్పొప్పులు వెతకాల్సిన పనిలేదని కియారా తేల్చి చెప్పారు.

  ఆ సీన్లు చేసేపుడు ఇబ్బంది పడలేదు

  ఆ సీన్లు చేసేపుడు ఇబ్బంది పడలేదు

  ‘లస్ట్ స్టోరీస్' మూవీలో స్వయం తృప్తి సీన్ చేసేపుడు ఎలాంటి ఇబ్బంది పడలేదు. మేము మా జాబ్ చేస్తున్నామని మాకు తెలుసు. దర్శకుడు కరణ్ జోహార్ ఆ సీన్ ఫన్నీగా కాకుండా రియలిస్టిక్‌గా చేయాలని సూచించారు. సెన్సేషన్ కోసం ఇలాంటివి చేయలేదు. స్క్రిప్టు ప్రకారం అది కీలకం కాబట్టే ఆ సీన్ చేయడం జరిగింది అని కియారా తెలిపారు.

   లస్ట్ స్టోరీస్

  లస్ట్ స్టోరీస్

  లస్ట్ స్టోరీస్ అనేది ఒక ఆంథాలజీ(సంపుటి) చిత్రం. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ మాదిరిగానే ఇది ఓ రకమైన సినిమా. ఈ చిత్రానికి జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. 120 నిమిషాల నిడివిగల ఈ సినిమాలో ఈ నలుగురు డైరెక్టర్లు ఒక్కో పార్ట్‌కు డైరెక్షన్ చేశారు. నెట్‌ప్లిక్స్‌లో దీన్ని విడుదల చేశారు.

   కియారాకు ఎక్కువ గుర్తింపు

  కియారాకు ఎక్కువ గుర్తింపు

  ‘లస్ట్ స్టోరీస్' మూవీలో కియారా అద్వానీ, రాధిక ఆప్టే, భూమి ఫడ్నేకర్, మనీషా కొయిరాలా, విక్కీ కౌశల్, నేయిల్ భూపాలమ్, నేహా ధూపియా, సంజయ్ కపూర్, ఆకాష్ తోసర్ లాంటి ప్రముఖులు నటించారు. అయితే స్వయంతృప్తి సీన్ కారణంగా అందరికంటే హైలెట్ అయింది కియారా. ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

  English summary
  Kiara Advani has been in the news over the past couple of days for her masturbation scene in Lust Stories. "I feel now it is becoming normal and natural and people are talking about it, eventually they will think, why make a big deal of it? It will take time. Not every person is going to be okay. For instance, kissing scenes were considered a huge deal but not today," The Asian Age quoted the actress as saying.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more