పెళ్లి విషయంలో ప్లాన్ చేంజ్ చేసిన కీయరా అద్వానీ.. ఆ హీరో ఇష్ట ప్రకారమే మార్పులు!
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మంచి అవకాశాలు అందుకుంటూ కియారా అద్వానీ తన స్థాయిని పెంచుకుంటుంది. అలాగే కియారా అద్వానీ చాలా రోజుల తర్వాత మళ్లీ పెళ్లి వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ బ్యూటీ ఒక బాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మొత్తానికి బాలీవుడ్ లో ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయింది అన్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. రీసెంట్ గా కీయరా తన పెళ్లి విషయంలో బాయ్ ఫ్రెండ్ నిర్ణయం మేరకు తన ప్లాన్ చేంజ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలలోకి వెళితే...

అతి తక్కువ కాలంలోనే
బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కియారా అద్వానీ అతి తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో ఆమె మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వినయ విధేయ రామ తో డిజాస్టర్ ఎదురైనప్పటికి మళ్ళీ రామ్ చరణ్ 15వ సినిమాలో అవకాశం అందుకుంది.

వాళ్లు డేటింగ్ లో ఉన్నారు..
అయితే గత ఏడాది నుంచి ఈ బ్యూటీ పెళ్లికి సంబంధించిన వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. వాళ్లు డేటింగ్ లో ఉన్నారు అని త్వరలో పెళ్లికూడా చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారని ఇదివరకే చాలాసార్లు బాలీవుడ్ మీడియాలో టాక్ అయితే వచ్చింది. కానీ ఎప్పుడూ కూడా ఆ విషయంపై మాత్రం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.

విభేదాలు రావడంతో..
మధ్యలో వీరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు అని కూడా ఒక టాక్ వినిపించింది. అసలైతే ఒకానొక సమయంలో సిద్దార్థ్ మల్హోత్రా తాను ఎవరిని ప్రేమించడం లేదు అని కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అయినప్పటికీ ఈ జంట ప్రైవేట్ పార్టీలలో అలాగే కొన్ని స్పెషల్ వెకేషన్ లో కనిపిస్తూ ఉండడంతో డేటింగ్ లో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో ఎన్నో కథనాలు వెలువడ్డాయి.

మొదట గోవాలో..
అసలైతే ఈ ఏడాదిలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది అని అందుకోసం కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయని మరొక కొత్త టాక్ వినిపించింది. కియార అద్వానీ ఇష్టప్రకారం వారి పెళ్లిని గోవాలో నిర్వహించాలి అని కూడా అనుకున్నారట. కానీ ఆ తర్వాత మళ్ళీ సిద్ధార్ధ్ మల్హోత్రా కుటుంబ సభ్యుల కోరిక మేరకు ప్లాన్ చేంజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

పెళ్లి అక్కడే..?
మొదట గోవాలో పెళ్లి చేసుకోవడానికి దాదాపు ఒక ప్రైవేట్ హోటల్ కూడా బుక్ చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ సిద్ధార్థ్ మల్హోత్రా నిర్ణయం ప్రకారం చండీగర్ లో వివాహ వేదికను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా పంజాబీ ఫ్యామిలీ కావడంతో అక్కడే వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లిని నిర్వహించాలి అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2023 మొదట్లోనే ఈ బాలీవుడ్ కపుల్ ఒకటి కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











