Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Kiara Advani: మెట్రో రైలులో హీరోతో కలిసి అలాంటి పని.. చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ ఆగ్రహం..
ఇటీవల కాలంలో బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న హీరోయిన్ కియారా అద్వానీ ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా ఇచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. దీంతో అగ్రహీరోలతో చాలా ఈజీగా అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. అయితే కేవలం అగ్ర హీరోలతో మాత్రమే కాకుండా మిడియం రేంజ్ హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.
వీలైనంతవరకు మంచి కంటెంట్ ఉన్న కథలను ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది. తన పాత్ర చిన్నదైనా పర్వాలేదు కానీ సినిమా మాత్రం సక్సెస్ అయితే చాలు అని ఆలోచించే అతి కొద్ది మంది హీరోయిన్స్ లొ కీయరా ఒకరు. అయితే కెరీర్ మంచి ఊపు అందుకుంటున్న సమయంలో ఈ బ్యూటీ ఇటీవల ఊహించని విధంగా ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంది. ముంబై మెట్రో రైల్లో తోటి హీరోతో కలిసి ప్రమోషన్స్ భాగంగా చేసిన పనికి అనవసరంగా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.

సాధారణ ప్రజలకు నిబంధనలు తీసుకున్నట్లు ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే.. జగ్ జగ్ జీయో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కియారా అద్వానీ తోటి నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ఇటీవల ముంబై మెట్రో రైలు ఎక్కింది. ఆమెతో పాటు ప్రముఖ నటులు అనిల్ కపూర్ నీతూ కపూర్ కూడా ఉన్నారు.
అయితే వరుణ్ ధావన్ కీయరా అక్కడ ఫేమస్ అయిన వడా పావ్ తీసుకుని మెట్రో రైల్ లోనే తినడం జరిగింది. అయితే సాధారణంగా ముంబై మెట్రో లో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకు రాకూడదు అని ఇక్కడ తినడం నిషేధం అని కూడా రైల్వే అధికారులు నిబంధనలను విధించారు. అయితే ఇప్పుడు కీయరా వరుణ్ ధావన్ ఇద్దరు కూడా తింటూ కనిపించడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ఈ కొత్త రూల్ ఎప్పటి నుంచి అని సెటైర్లు వేస్తున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలి అని సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫోటోలను వైరల్ అయ్యేలా చేస్తున్నారు.