Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పాపా నీ పబ్లిసిటీ స్టంట్స్ ఆపమ్మా... హీరోయిన్ కియారా వీడియోపై ట్రోలింగ్!
మహేష్ బాబు మూవీ 'భరత్ అనే నేను' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు మండి పడుతున్నారు.
పొడవైన అందమైన జుట్టు కలిగిన కియారా... ''ఎవరికైనా తమ జుట్టు అంటే ఇష్టమే. కానీ ఎండలు, హీట్ కారణంగా ఈ జుట్టుతో ఇబ్బంది పడుతున్నాను, బిజీ షెడ్యూల్ వల్ల మెయింటేన్ చేయడం నా వల్ల కావడం లేదు'' అంటూ కత్తెరతో కట్ చేసి పారేసింది. అయితే వీడియోపై అభిమానుల నుంచి ఆమె ఊహించని రిప్లై వచ్చింది.
పబ్లిసిటీ స్టంట్ అంటూ సెటైర్లు
రియారా అద్వానీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.... ఇదంతా కియారా పబ్లిసిటీ స్టంట్ అంటూ సెటైర్లు వేయడం ప్రారంభించారు. అది నిజమైన జుట్టు కాదు... హెయిర్ ఎక్స్టెన్షన్, విగ్గు అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. సినిమా వాళ్ల జుట్ట అస్సలు నమ్మవద్దు అంటూ మరికొందరు చమత్కరించారు.
సినిమా షూటింగ్ కోసమేనా?
హీరోయిన్లు సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్ కనిపించేలా హెయిర్ స్టైల్ మార్చేస్తుంటారు. వారు పోషించే పాత్రలకు తగిన విధంగా పొట్టి జుట్టు లేకా పొడవాటి జుట్టుతో ఉండాలా అనేది సినిమాకు సంబంధించిన డైరెక్టర్, స్టైలిస్ట్ డిసైడ్ చేస్తారు. కియారా విషయంలో కూడా ఇలాంటి కారణమే ఉండొచ్చని భావిస్తున్నారు.
వరుసగా రీమేక్ చిత్రాలకు కమిటైన కియారా
కియారా అద్వానీ వరుసగా రీమేక్ చిత్రాలకు కమిటైంది. అర్జున్ రెడ్డి మూవీ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్' చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్న కియారా.... ఇటీవలే ‘లక్ష్మీ బాంబ్' అనే చిత్రానికి కమిటైంది. అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ‘కాంచన' రీమేక్.
కియారా అద్వానీ
కియారా అద్వానీ ఈ ఏడాది విడుదలైన తెలుగు మూవీ ‘వినయ విదేయ రామ'లో హీరోయిన్ పాత్రలో, హిందీలో ‘కలంక్'లో ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. ఆమె నటించిన తాజా చిత్రం ‘కబీర్ సింగ్' జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.