Kiara Advani పెళ్లిలో ట్విస్టు.. బాలీవుడ్ బ్యూటీ వివాహం వాయిదా.. సిద్దార్థ్‌తో మ్యారేజ్ ఎప్పుడంటే?

బాలీవుడ్ తారలు సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్న ఈ యువ తారలు రాజస్థాన్‌లో జైసల్మేర్‌లోని సూర్యగఢ్ కోటలో వివాహం చేసుకొనేందుకు నిర్ణయించుకొన్నారు. ఇప్పటికే సిద్దార్థ్, కియారా కుటుంబ సభ్యులతోపాటు పలువురు బాలీవుడ్ తారలు జైసల్మేర్‌కు చేరుకొన్న విషయం తెలిసిందే. అయితే కియారా అద్వానీ పెళ్లి అనుకొన్న తేదీ కాకుండా వాయిదా పడటం ట్విస్టుగా మారింది. కియారా, సిద్దార్థ్ పెళ్లి ఏ రోజు జరగబోతుందనే విషయంలోకి వెళితే..

రాజస్థాన్ డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్‌గా

రాజస్థాన్ డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్‌గా

బాలీవుడ్ సినీ ప్రేమపక్షుల వివాహానికి రాజస్థాన్ డెస్టినేషన్‌గా మారింది. ఇప్పటికే రాజస్థాన్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోన్స్ దంపతులయ్యారు. వారి తర్వాత వికీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా అక్కడే పెళ్లి చేసుకొన్నారు. రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుక కూడా రాజస్థాన్‌లోనే జరిగింది. తాజాగా సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ రాజస్థాన్‌లోని సూర్యాగఢ్ హోటల్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేసుకొన్నారు.

జైసల్మేర్‌కు బాలీవుడ్ ప్రముఖులు

జైసల్మేర్‌కు బాలీవుడ్ ప్రముఖులు

సిద్దార్థ్, కియారా పెళ్లి కోసం బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, మనీష్ మల్హోత్రాతోపాటు సిద్దార్థ్ తల్లిదండ్రులు హర్షద్ మల్హోత్రా, రిమ్మా మల్హోత్రా, అలాగే కియారా అద్వానీ కుటుంబ సభ్యులు జైసల్మేర్‌కు చేరుకొన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి జైసల్మేర్‌కు చేరుకొన్న అతిథులకు కియారా, సిద్దార్థ్.. సూర్యాగఢ్ హోటల్‌లో సోమవారం లంచ్ ఏర్పాటు చేశారు.

సూర్యగఢ్ కోటలో పెళ్లి వేడుకలు షురూ

సూర్యగఢ్ కోటలో పెళ్లి వేడుకలు షురూ

ఇక ఆదివారం రాత్రి నుంచే పెళ్లి హడావిడి సూర్యాగఢ్ హోటల్‌లో కనిపించింది. ఆదివారం రాత్రి నుంచి మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు ఆరంభమయ్యాయి. మహందీ ఫంక్షన్ ఆదివారం పూర్తయింది. హల్దీ, సంగీత్ వేడుకలు సోమవారం ఆరంభం కానున్నాయి. సంగీత్ కార్యక్రమానికి కియారా సోదరుడు సంగీత దర్శకుడు మిషాల్ అద్వానీ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు.

ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులతో హంగమా

ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులతో హంగమా

కియారా అద్వానీ పెళ్లి కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా పెళ్లి దుస్తులను డిజైన్ చేశారు. ఏకంగా కియారాతోనే మనీష్ జైసల్మేర్‌కు చేరుకొన్నారు. కియారాకు మేకప్ చేయడానికి లేఖా గుప్తా వివాహ వేదిక వద్దకు చేరుకొన్నారు. పలువురు సినీ తారలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

కియారా పెళ్లి ఒక రోజు వాయిదా?

కియారా పెళ్లి ఒక రోజు వాయిదా?

అయితే వాస్తవానికి కియారా అద్వానీ, సిద్దార్థ్ పెళ్లి ఒక రోజు వాయిదా పడింది. వాస్తవానికి కియారా, సిద్దార్థ్ పెళ్లి ఫిబ్రవరి 6వ తేదీ అంటే సోమవారం జరుగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహాన్ని ఫిబ్రవరి 7 మంగళవారం జరుపనున్నారు. ఇప్పటికే సూర్యాగఢ్ హోటల్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X