అర్జున్‌ రెడ్డితో కియారా రొమాంటిక్ డేట్.. సెల్ఫీలో బంధించిన ‘ప్రీతీ’.. ఏం జరిగిందంటే!

Recommended Video

Kiara Advani Shared The Picture With The Vijay Deverakonda | Filmibeat Telugu

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ఊహించడమే కష్టం. సాధారణ ప్రజల విషయం పక్కన పెడితే సినిమా స్టార్లే విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకోవడంతో క్రేజ్ రెండింతలు పెరిగింది. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ ఉన్న యువ హీరోల్లో ఒకరిగా విజయ్ దేవరకొండ పేరు సంపాదించుకొన్నాడు. ఈ క్రమంలో ఆయన నటించిన అర్జున్ రెడ్డి చిత్రం పలు భాషల్లోకి రీమేక్ అవుతున్నది. ఈ క్రమంలో హిందీ రీమేక్‌లో ప్రీతి పాత్రను పోషిస్తున్న కియారా అద్వానీ ఇటీవల విజయ్ దేవరకొండను కలుసుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఇంతకు వారిద్దరు ఎందుకు కలుసుకొన్నారంటే...

హిందూస్థాన్ టైమ్స్ అవార్డుల కార్యక్రమంలో

హిందూస్థాన్ టైమ్స్ అవార్డుల కార్యక్రమంలో

ఇటీవల హిందూస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిస్ 2019 అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, దక్షిణాది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండకు కూడా ఆహ్వానం అందడంతో ఆయన కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా పింక్ డ్రస్‌ను ధరించిన కియారా అద్వానీ హాజరై అందర్నీ ఆకర్షించింది. హీరో విజయ్ దేవరకొండతో మాటలు కలిపేసింది.

 రియల్ అర్జున్ రెడ్డితో కలిసి

రియల్ అర్జున్ రెడ్డితో కలిసి

మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండతో చిట్ చాట్ చేస్తూ ఫోటోకు ఫోజిచ్చారు. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. అర్జున్‌ను కలిసిన ప్రీతి.. ఎట్టకేలకూ రియల్ అర్జున్ రెడ్డిని కలుసుకొన్నాను.. ఓ ఫ్యాన్‌గా నాకు ఇష్టమైన హీరోను కలుసుకొన్న గొప్ప అనుభూతి అని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసింది.

 విజయ్ దేవరకొండ గ్రేట్ యాక్టర్ అని

విజయ్ దేవరకొండ గ్రేట్ యాక్టర్ అని

గతంలో ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా కియారా మాట్లాడుతూ.. నాకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటనకు ఫిదా అయ్యాను. విజయ్ గ్రేట్ యాక్టర్. స్క్రీన్ పై వారి కారెక్టర్లు నిజంగా జీవించాయి. వారిద్దరూ యువ హీరో, హీరోయిన్లకు ఓ సవాల్‌తో కూడిన టార్గెట్‌ను సెట్ చేశారు అని పేర్కొన్నది.

 హిందీ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ కన్ఫర్మ్

హిందీ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ కన్ఫర్మ్

ఇటీవలే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం జూన్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. హిందీలో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X