Kiara Advani కి ముఖం చాటేసిన స్టార్ హీరో.. సల్మాన్‌కు మాజీ ప్రేయసి అలాంటి షాక్!
బాలీవుడ్ తారలు వికీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లికి ఏర్పాట్లు ఆర్బాటంగా జరుగుతున్నాయి. కానీ ఏ విషయాలు బయటకు పొక్కకుండా చాప కింద నీరులా ఎర్పాట్లు జరిగిపోతున్నాయి. పెళ్లికి ముహుర్తం సమీపిస్తుండటంతో ఆ వివాహానికి వెళ్లే ప్రముఖుల జాబితాపై ఆసక్తి పెరిగింది. అయితే వికీ కౌశల్‌కు క్లోజ్‌గా ఉన్న కియారా అద్వానీకి ఆహ్వానం అందకపోవడం జాతీయ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 9వ తేదీన పెళ్లి
కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. వికీ కౌశల్, కత్రినా డిసెంబర్ 3వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్‌లోని సవాయ్ మదోపూర్ జిల్లాలోని ప్రతిష్టాత్మక ప్రదేశంలో ఈ టాప్ స్టార్స్ వివాహానికి ఏర్పాట్లు చేశారు.

పెళ్లి వేదిక వద్ద సెలబ్రిటీలకు ఆంక్షలు
అయితే పెళ్లి వేదిక వద్ద ప్రముఖులకు కూడా భారీగా ఆంక్షలు విధించారు. పెళ్లిలో ఎవరూ కూడా మొబైల్ ఫోనల్తో ఫోటోలు తీయవద్దు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో షేర్ చేయద్దని స్ట్రిక్ట్‌గా సూచించినట్టు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించిన తొలి ఫోటో కేవలం కత్రినా, వికీ కౌశల్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది.

నాకు పెళ్లి ఆహ్వానం అందలేదు అంటూ
బాలీవుడ్ ప్రముఖుల్లో ఎవరెవరికీ ఆహ్వానాలు అందాయనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తనకు ఆహ్వానం అందలేదని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వికీ కౌశల్‌తో కియారాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో నటించారు. అలా బెస్ట్ రిలేషన్ ఉన్న కియారాకు ఆహ్వానం అందకపోవడంపై స్వయంగా ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నిజంగా పెళ్లి జరుగుతుందా?
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వికీ, కత్రినా పెళ్లికి సంబంధించిన సమాచారం తనకు తెలియదు. వారిద్దరు నిజంగా పెళ్లి చేసుకొంటున్నారా? నాకు ఈ వార్త వినిపించింది. కానీ నాకు ఎలాంటి ఇన్విటేషన్ లేదు. ఇప్పటి వరకు నాకు ఆహ్వానం అందలేదు అంటూ కియారా అద్వానీ చెప్పడంతో రకరకాల ఊహాగానాలు జోరందుకొన్నాయి.

సల్మాన్ ఖాన్ నో ఇన్విటేషన్
ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్‌కు కూడా ఆహ్వాన పత్రిక పంపించలేదనే విషయం కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ కండలవీరుడు చెప్పడం తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్‌కు కూడా ఇన్విటేషన్ అందలేదనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆహ్వానితుల జాబితాలో భారత్ మూవీ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఉన్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











